Home న్యూస్ హిందీలో ఇక చరిత్ర ఖాయం…ఇదేం కొట్టుడు సామి అసలు!!

హిందీలో ఇక చరిత్ర ఖాయం…ఇదేం కొట్టుడు సామి అసలు!!

0

తెలుగుతో పాటు హిందీలో ఎక్స్ లెంట్ మార్కెట్ ను సొంతం చేసుకున్న హీరో పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ సినిమా కల్కి 2898AD(Kalki2898AD Movie) అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ ని పూర్తి చేసుకోగా సినిమా హిందీలో ఊహకందని రేంజ్ లో వీకెండ్ లో మాస్ రాంపెజ్ ను తలపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది…

అసలు ఎలాంటి ప్రమోషన్స్ ను హిందీలో సొంతం చేసుకోక పోవడంతో నార్మల్ ఓపెనింగ్స్ వస్తాయి అనుకున్న చోటు నుండి షో షోకి బుకింగ్స్ లో సాలిడ్ ట్రెండ్ ను చూపెడుతూ ప్రతీ రోజు కలెక్షన్స్ పరంగా హిందీలో గ్రోత్ ని చూపించిన సినిమా నాలుగో రోజుకి వచ్చే సరికి మాత్రం అంచనాలను మరింత గా మించి పోయి సంచలనం సృష్టించింది…

ఏకంగా 40 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని హిందీలో 4వ రోజున క్రాస్ చేసిన సినిమా ఫస్ట్ డే మీద ఆల్ మోస్ట్ డబుల్ కలెక్షన్స్ ని అందుకుందని చెప్పాలి ఇప్పుడు…. సినిమా వీకెండ్ లో చూపించిన ఊపు ఇప్పుడు లాంగ్ రన్ లో చూపించే  అవకాశం ఎంతైనా ఉన్న నేపధ్యంలో లాంగ్ రన్ లో అద్బుతాలు సృష్టించవచ్చు….

   

ఒకసారి సినిమా హిందీలో వీకెండ్ లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే
#Kalki2898AD Hindi Day Wise Collections
👉Day 1: 22.50Cr
👉Day 2: 23.25Cr
👉Day 3: 26.25Cr
👉Day 4: 40.15Cr
AP-TG Total:- 112.15CR

మొత్తం మీద 4 రోజుల్లో 112 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన కల్కి మూవీ ఇప్పుడు హిందీలో ఆపడం కష్టమే…రీసెంట్ టైంలో అసలు ప్రమోషన్స్ లేకుండా ఈ రేంజ్ లో మౌత్ టాక్ తో హిందీలో ఊచకోత కోసిన రికార్డ్ ఈ సినిమాకే చెల్లుతుంది.

5వ రోజు వర్కింగ్ డే లో సైతం మాస్ హోల్డ్ ని చూపిస్తున్న సినిమా మొదటి రోజుతో పోల్చితే చాలా తక్కువ డ్రాప్స్ ను మాత్రమే సొంతం చేసుకుని దూసుకు పోతుంది…. లాంగ్ రన్ లో ఇప్పుడు అవలీలగా 250-275 కోట్ల మార్క్ ని టార్గెట్ చేస్తున్న ఈ సినిమా అంతకుమించిన జోరుని కూడా చూపించే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here