బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక టైంలో మీడియం రేంజ్ హీరోలలో మంచి ప్రామిసింగ్ హీరోగా అనిపించినా కూడా తర్వాత వరుస పెట్టి ఎక్స్ పెరిమెంట్స్ మూవీస్ చేస్తూ ఫామ్ మొత్తం కోల్పోయిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) ఇప్పుడు పూర్తిగా ఫామ్ కోల్పోయాడు… వరుణ్ తేజ్ రీసెంట్ మూవీస్ బడ్జెట్ పరంగా ఎక్కువ బడ్జెట్ తోనే నిర్మాణం అయినా కూడా…
కలెక్షన్స్ పరంగా మాత్రం తీవ్రంగా నిరాశ పరిచాయి. బడ్జెట్ ప్రకారం చూసుకుంటే అందులో 10% కూడా రికవరీని సొంతం చేసుకోలేక బాక్ టు బాక్ భారీ డిసాస్టర్ లను సొంతం చేసుకుంటూ తీవ్రంగా నిరాశ పరిచే ఫామ్ లోకి వచ్చేశాడు… కెరీర్ లో ఫిదా, తొలిప్రేమ, గణేష్ లాంటి…
సినిమాలతో మంచి హిట్స్ ను అలాగే ఎఫ్2, ఎఫ్ 3 లాంటి మల్టీ స్టారర్ హిట్స్ పడినా కూడా సోలో హీరోగా చేసిన లాస్ట్ 4 సినిమాలు ఒకటికి మించి ఒకటి భారీ నష్టాలను సొంతం చేసుకునే నష్టాలను సొంతం చేసుకున్నాయి. గద్దలకొండ గణేష్ తర్వాత చేసిన…
గని మూవీ 26 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకుంటే 5 కోట్లు కూడా వసూళ్లు అందుకోలేక పోయి భారీ డిసాస్టర్ గా నిలిచింది..ఆ తర్వాత చేసిన గాండీవధారి అర్జున సినిమా మినిమమ్ స్టార్ట్ ను కూడా సొంతం చేసుకోలేక పోయింది. టోటల్ రన్ లో ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది.
ఇక ఈ ఇయర్ మొదట్లో ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో మరో ఎక్స్ పెరిమెంట్ చేసిన వరుణ్ తేజ్ కి ఈ సినిమా ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని ఏకంగా హాట్రిక్ ఎపిక్ డిసాస్టర్ లు తన ఖాతాలో పడగా ఇప్పుడు లేటెస్ట్ గా మట్కా మూవీ(Matka Movie) తో…
రీసెంట్ గా రాగా ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుని వరుణ్ తేజ్ కి కంబ్యాక్ మూవీ అవుతుంది అనుకున్నా కూడా ఇప్పుడు పట్టుమని 1.5 కోట్ల మార్క్ ని కూడా అందుకునే అవకాశం కనిపించడం లేదు. దాంతో డబుల్ హాట్రిక్ ఫ్లాఫ్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు వరుణ్ తేజ్…అప్ కమింగ్ మూవీస్ కి మరింత శ్రద్ధ తీసుకోకపోతే మట్టుకు తేరుకునే అవకాశం లేదనే చెప్పాలి.