Home న్యూస్ నాలుగు సార్లు 600….ఇండియన్ హిస్టరీలో ఓకే ఒక్కడు!!

నాలుగు సార్లు 600….ఇండియన్ హిస్టరీలో ఓకే ఒక్కడు!!

0

టాలీవుడ్ హీరోల రికార్డులు అన్ని బ్రేక్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతూ ఉండగా బాహుబలి(Baahubali) సిరీస్ తో తనకి పాన్ ఇండియా రేంజ్ లో ఏర్పడిన మార్కెట్ ను ఫుల్లుగా వాడుకుంటూ సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ ఉండగా….

మధ్యలో ఒక్క రాధే శ్యామ్ సినిమాతో మాత్రమే అంచనాలను అందుకోలేక పోయాడు. మిగిలిన సినిమాలు అన్నీ మంచి జోరునే చూపించగా 7 నెలల క్రితం వచ్చిన సలార్(Salaar) మూవీ తో రచ్చ చేసిన ప్రభాస్ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ప్రభాస్ నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ….

అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మొదటి వారంలో ఆల్ మోస్ట్ 650 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకోగా, ఓవరాల్ గా ఈ సినిమా తో ప్రభాస్ ఇప్పుడు ఇండియన్ సినిమా హిస్టరీలోనే మరే హీరోకి సాధ్యం కాని విధంగా నాలుగు సార్లు ఏకంగా 600 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని….

సంచలన రికార్డ్ ను నమోదు చేశాడు…..ఇది వరకు బాహుబలి సిరీస్ రెండు పార్టులు ఈ మార్క్ ని అందుకోగా తర్వాత సలార్ మూవీ ఈ మార్క్ ని క్రాస్ చేసింది. ఇక ఇప్పుడు కేవలం ఫస్ట్ వీక్ లోనే వరల్డ్ వైడ్ గా ప్రభాస్ కల్కి మూవీతో ఈ మార్క్ ని దాటేసి 4 వ సారి 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని…

దాటేసి సంచలన రికార్డ్ ను నమోదు చేశాడు. ఇండియన్ సినిమా హిస్టరీలో ప్రభాస్ పేరిట ఏర్పడ్డ ఈ రికార్డ్ ను రెబల్ స్టార్ తన అప్ కమింగ్ మూవీస్ తో ఇలానే కొనసాగించే అవకాశం ఎంతైనా ఉండగా ఇక కల్కి మూవీ లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here