వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నప్పటికీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఊరమాస్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie), నాలుగో వారంలో అడుగు పెట్టిన తర్వాత కూడా కొత్త సినిమాల నుండి…
పోటిని ఎదురుకున్నా కూడా అన్ని చోట్లా కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని మరోసారి చూపించిన పుష్ప2 మూవీ నాలుగో వీక్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ థియేటర్స్ హోల్డ్ తో దూసుకు పోతుంది. సినిమా నైజాం ఏరియాలో నాలుగో వారంలో ఇప్పుడు ఓవరాల్ గా 160 వరకు థియేటర్స్ ని…
హోల్డ్ చేయగా ఆంధ్ర సీడెడ్ ఏరియాలో 350 వరకు థియేటర్స్ లో రన్ ని కొనసాగిస్తూ ఉండగా, ఆల్ మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో 4వ వారంలో 500 కి పైగా థియేటర్స్ లో రన్ ని కొనసాగిస్తుంది. మూడో వీక్ లో 700 వరకు థియేటర్స్ లో రన్ అవ్వగా 200 థియేటర్స్ మాత్రమే ఇప్పుడు తగ్గాయి…
ఇక కర్ణాటక, తమిళ్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఓవరాల్ గా సినిమా 120 వరకు థియేటర్స్ లో రన్ అవుతూ ఉండగా హిందీలో సినిమా 4వ వీక్ లో కొత్త సినిమా రిలీజ్ అయినా కూడా స్క్రీన్ కౌంట్ ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి ఆల్ మోస్ట్ 2000 వరకు థియేటర్స్ లో…
రన్ ని కొనసాగిస్తూ ఉండగా మొత్తం మీద ఇండియాలో సినిమా నాలుగో వీక్ లో 2600 కి పైగా థియేటర్స్ ని హోల్డ్ చేసి కుమ్మేసింది…మూడో వారంతో పోల్చితే కేవలం 1000 రేంజ్ లోనే థియేటర్స్ తగ్గగా… ఓవర్సీస్ థియేటర్స్ తో కలిపి సినిమా వరల్డ్ వైడ్ గా 3200 వరకు థియేటర్స్ లో…
ఇప్పుడు 4వ వారాన్ని కొనసాగిస్తుంది…ఇండియన్ మూవీస్ లో ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ థియేటర్స్ హోల్డ్ అని చెప్పాలి నాలుగో వారంలో….ఇక ఈ వీక్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి ఇప్పుడు.