Home న్యూస్ రాయలసీమ గడ్డ మీద రెబల్ స్టార్ చరిత్రకెక్కే రికార్డ్ కొట్టాడుగా!!

రాయలసీమ గడ్డ మీద రెబల్ స్టార్ చరిత్రకెక్కే రికార్డ్ కొట్టాడుగా!!

0

టాలీవుడ్ లో ఊరమాస్ సినిమాలను ఎక్కువగా ఆదరించే ఏరియాగా రాయలసీమ ఏరియా నిలుస్తుంది…మంచి మాస్ కంటెంట్ తో సినిమా వస్తే సీడెడ్ లో సాలిడ్ కలెక్షన్స్ సొంతం అవ్వడం ఖాయమని చెప్పాలి. మన టాప్ స్టార్స్ నటించిన సినిమాలు హిట్ టాక్ వస్తే ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం కామన్ గా మారగా….

ఈ ఏరియాలో ఇప్పుడు పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసి చరిత్ర సృష్టించాడు….మిగిలిన హీరోలు ఎవ్వరూ దరిదాపుల్లో కూడా లేని విధంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 సార్లు రాయలసీమ లో ఏకంగా 20 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించాడు…

ఇది వరకు బాహుబలి(Baahubali) సిరీస్ రెండు సినిమాలతో ఇక్కడ సంచలనం సృష్టించిన ప్రభాస్ తర్వాత లాస్ట్ ఇయర్ సలార్(Salaar Movie) తో దుమ్ము లేపగా ఇప్పుడు ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ కూడా చేయని సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో వచ్చిన కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) సినిమా…

Kalki 2898 AD 18 Days Total World Wide Collections!!

20 కోట్ల షేర్ మార్క్ ని సీడెడ్ లో అందుకుని సంచలనం సృష్టించింది…. బాహుబలి1 ఇక్కడ 21.8 కోట్ల షేర్ ని అందుకోగా బాహుబలి2 మూవీ టోటల్ రన్ లో 34.75 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది…ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన సలార్ మూవీ టోటల్ రన్ లో 22.75 కోట్ల రేంజ్ లో…

షేర్ ని అందుకుని మాస్ రచ్చ చేయగా ఇక లేటెస్ట్ గా కల్కి మూవీ 20 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకుని ఓవరాల్ గా 4 సార్లు 20 కోట్లకు పైగా షేర్ ని సీడెడ్ లో అందుకుని చరిత్రలో ఎవ్వరికీ లేని రికార్డ్ ను నమోదు చేశాడు ప్రభాస్….మిగిలిన హీరోలు ఇప్పుడు ప్రభాస్ ను అందుకోవాలి అంటే…

ఇప్పుడు చేస్తున్న సినిమాల కన్నా స్పీడ్ పెంచాల్సి మరింత జోరు చూపించాల్సి ఉంటుంది, అదే టైంలో రెబల్ స్టార్ తన అప్ కమింగ్ మూవీస్ లో సాలిడ్ సీక్వెల్స్ ని ప్లాన్ చేసుకున్నాడు కాబట్టి ఈ లెక్క ఇంకా  పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. అంటే ఇప్పట్లో ప్రభాస్ ను ఇతర హీరోలు అందుకోవడం కష్టమే అని చెప్పాలి.

Kalki 2898 AD 17 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here