బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ భీమ్లా నాయక్ సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది, టికెట్ హైక్స్ ఉండి ఉంటే లెక్క ఇంకో రేంజ్ లో ఉండేది కానీ టికెట్ హైక్స్ లేక పోయినా కానీ నైజాంలో ఉండటంతో అక్కడ ఎక్కువ వసూళ్ళని సాధిస్తున్న భీమ్లా నాయక్ 5 వ రోజు మరోసారి ఓవర్ల గా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్స్ లెంట్…
కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. సినిమా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో 8.5 కోట్ల నుండి 9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 9.5 కోట్ల నుండి 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే…
అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఈ కలెక్షన్స్ తో సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 5 రోజుల్లో 88 కోట్ల నుండి 89 కోట్ల రేంజ్ గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 130 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోబోతుంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకొంచం పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పాలి.