Home న్యూస్ రామారావ్ ఆన్ డ్యూటీ టీసర్ రివ్యూ….ఈ సారి హిట్ పక్కా!!

రామారావ్ ఆన్ డ్యూటీ టీసర్ రివ్యూ….ఈ సారి హిట్ పక్కా!!

0

మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ క్రాక్ సినిమా తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చినా కానీ ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ ఖిలాడి తో నిరాశ పరిచాడు, సినిమా పర్వాలేదు అనిపించేలా ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ అంచనాలను అందుకోలేక పోయింది, దాంతో ఈ సినిమా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోవడంతో ఇప్పుడు రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రామారావ్ ఆన్ డ్యూటీ పై….

అంచనాలు ఏర్పడగా టైటిల్ నుండే సినిమా పై బజ్ ఏర్పడింది, ఇక పోస్టర్స్ ఎప్పటికప్పుడు సినిమా పై మంచి ఆసక్తిని క్రియేట్ చేయగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేశారు మేకర్స్… కాగా మహా శివరాత్రి కానుకగా రిలీజ్ అయిన ఈ టీసర్ కి….

ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అవుతుంది అని చెప్పాలి. స్టోరీ పాయింట్ ఏంటి అనేది మొత్తం చెప్పక పోయినా కానీ సినిమాలో జిల్లా కలెక్ట్ కం MRO గా రెండు భాద్యతలను చేస్తున్న వ్యక్తిగా రవితేజ కనిపించబోతుండగా ఒక ఊరు, ఆ ఊరికి 2 భాద్యతలతో వచ్చిన హీరో…

ఆ ఊరికి ఉన్న సమస్యలను ఎలా సాల్వ్ చేశాడు అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కినట్లు కొన్ని విజువల్స్ ద్వారా స్టొరీ పాయింట్ అనిపిస్తుంది కానీ ఫుల్ కథ సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది అని చెప్పాలి. క్వాలిటీ పరంగా గ్రాండియర్ పరంగా మాత్రం చాలా రిచ్ గా సినిమాను తెరకెక్కించారని టీసర్ చూస్తుంటే అర్ధం అవుతూ ఉండగా మొత్తం మీద రవితేజ చెప్పిన డైలాగ్ కూడా…

బాగానే ఉందని చెప్పాలి. బ్యాగ్రౌండ్ స్కోర్ కొంచం ఎక్కువ డామినేట్ చేసినట్లు అనిపించగా చాలా వరకు విజువల్స్ తోనే సరిపెట్టారు మేకర్స్, మొత్తం మీద టీసర్ చూస్తుంటే ప్రామిసింగ్ గా ఉండటంతో కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా రవితేజ హిట్ కొట్టే అవకాశం ఉందనిపించేలా సినిమా ఉండబోతుంది అనిపిస్తుంది. ఇక ఈ టీసర్ కి 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here