కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య ల లేటెస్ట్ మూవీ బంగార్రాజు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ మూడు రోజుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత నాలుగో రోజు పార్షిక హాలిడే లో మంచి వసూళ్ళనే సొంతం చేసుకుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు ఫుల్ లెంత్ వర్కింగ్ డే లో ఎంటర్ అయిన బంగార్రాజు బాక్స్ ఆఫీస్ దగ్గర…
నైజాంలో హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఆంధ్రలో 50% ఆక్యుపెన్సీ మరియు నైట్ కర్ఫ్యూ వలన ఇబ్బందులను ఫేస్ చేసినా కానీ ఉన్నంతలో మంచి వసూళ్ళతో హోల్డ్ చేసింది అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో 5 వ రోజు 1.6 కోట్ల నుండి…
1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవచ్చు అని భావించినా కానీ సినిమా కొంచం బెటర్ గా హోల్డ్ చేసి 1.94 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మంచి హోల్డ్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఇక సినిమా టోటల్ గా 5 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 7.45Cr
👉Ceeded: 5.65Cr
👉UA: 4.01Cr
👉East: 3.29Cr
👉West: 2.41Cr
👉Guntur: 2.91Cr
👉Krishna: 1.88Cr
👉Nellore: 1.46Cr
AP-TG Total:- 29.06CR(46.90Cr~ Gross)
👉Ka+ROI: 1.58Cr
👉OS – 1.30Cr
Total WW: 31.94CR(53.20CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ వివరాలు…
సినిమాను మొత్తం మీద 38.15 కోట్ల రేంజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా 39 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 5 రోజులు పూర్తీ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 7.06 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో సినిమా ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.