నట సింహం నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వం లో మొదలు పెట్టి ఆపేసిన సినిమా నర్తనశాల… ఎప్పుడు 2004 లో మొదలైన ఈ సినిమా సౌందర్య గారి మరణం వలన ఆగిపోగా… ఆ ఫూటేజ్ ను మినీ మూవీ గా 16 ఏళ్ల తర్వాత రీసెంట్ గా డైరెక్ట్ రిలీజ్ చేశారు. పే పెర్ వ్యూ పద్దతిలో 50 టికెట్ రేటు తో రిలీజ్ చేయగా వచ్చిన డబ్బు తో మంచి పనులకు వాడాలని బాలయ్య నిర్ణయం తీసుకున్నారు.
ఇక సినిమా 24 న రిలీజ్ అవ్వగా మొదటి రోజు మొత్తం మీద 1 లక్షా 95 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు తెలియజేయగా… తర్వాత మొదటి వీకెండ్ మొత్తం మీద 2 లక్షల 85 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకోగా…
గ్రాస్ కలెక్షన్స్ సుమారు 1 కోటి 42 లక్షల దాకా వచ్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు 5 రోజులకు గాను ఈ మినీ మూవీ సాధించిన లెక్కలు తెలియవచ్చాయి. వీకెండ్ తర్వాత స్లో అయిన ఈ మినీ మూవీ మొత్తం మీద మిగిలిన రోజులల్లో ఇప్పటి వరకు 1 లక్షా 30 వేల దాకా…
యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుందట…. దాంతో టోటల్ గా 5 రోజులకు గాను సినిమా టోటల్ గా సాధించిన వ్యూస్ లెక్కలు ఇప్పుడు 4 లక్షల 15 వేల దాకా ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉండగా ఈ వ్యూస్ కి 50 టికెట్ రేటు తో కలెక్షన్స్ అల్టిమేట్ అనిపించే విధంగా వచ్చాయని అంటున్నారు. ఓవరాల్ గా 5 రోజులల్లో నర్తనశాల సినిమాకి…
పే పెర్ వ్యూ పద్దతిలో 2.07 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ దక్కి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు… ఇందులో 20% వరకు శ్రేయాస్ యాప్ వాళ్ళకి వెళుతుందని మిగిలింది బాలయ్య కి వెళుతుందని, ఈ మొత్తం ఇప్పుడు మంచి పనులకు బాలయ్య వాడతారని అంటున్నారు. ఇక మిగిలిన రోజుల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.