Home TRP రేటింగ్ మహేష్ బాబు మహర్షి….కన్నడ-తమిళ్ TRP రేటింగ్స్…షాకింగ్ రేటింగ్స్!

మహేష్ బాబు మహర్షి….కన్నడ-తమిళ్ TRP రేటింగ్స్…షాకింగ్ రేటింగ్స్!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా గా తెరకెక్కిన సినిమా మహర్షి… బాక్స్ ఆఫీస్ దగ్గర 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్సుడ్ రివ్యూ లను సొంతం చేసుకున్నా కానీ కామన్ ఆడియన్స్ విరగబడి సినిమా ను చూడగా సమ్మర్ లో భారీ కలెక్షన్స్ తో సినిమా సూపర్ హిట్ గా నిలిచింది, టాలీవుడ్ లో మిక్సుడ్ రివ్యూ లను సొంతం చేసుకున్నా కానీ…

హిట్ గా నిలిచిన కొన్ని సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. ఇక ఇదే విధంగా బుల్లి తెరపై కూడా మొదటి సారి నిరాశ పరిచే రేటింగ్ ని సొంతం చేసుకున్నా కానీ తర్వాత నుండి స్టడీ రేటింగ్స్ తో దూసుకు పోతూ కొత్త రికార్డులను నమోదు చేస్తూ సంచలనం సృష్టిస్తుంది.

దాంతో టెలివిజన్ లో కూడా ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు లేటెస్ట్ గా తమిళ్ లో అలాగే కన్నడ డబ్ అయ్యి టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వగా రెండు చోట్ల కూడా షాకింగ్ రేటింగ్స్ ని సొంతం చేసుకుంది,….

తమిళ్ లో మహేష్ బాబు ప్రీవియస్ మూవీస్ కి సాలిడ్ రేటింగ్స్ దక్కాయి…. వాటి తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ మూవీ నే అయినా కానీ 3.7 రేటింగ్ ని మాత్రమే సొంతం చేసుకుంది, అక్కడ 1 నేనొక్కడినే 13, స్పైడర్ 10 దాకా రేటింగ్ తెచ్చుకుని రికార్డ్ సృష్టించాయి. ఇక మహర్షి కన్నడ లో కూడా డబ్ అవ్వగా అక్కడ మొత్తం మీద…

3.4 TRP రేటింగ్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా… అక్కడ మహేష్ లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు 6.5 రేటింగ్ తో అల్టిమేట్ రికార్డ్ ను అందుకోగా… మహర్షి కూడా లాస్ట్ ఇయర్ మూవీ నే అవ్వడం తో మరింత ఎక్కువ రేటింగ్ లను ఎక్స్ పెర్ట్ చేశారు అందరూ.. కానీ IPL మ్యాచులు కొంచం ఎఫెక్ట్ చూపాయని చెప్పొచ్చు. లేకుంటే కొంచం బెటర్ రేటింగ్ ని సినిమా సాధించి ఉండేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here