Home న్యూస్ 50 నుండి 280….45 నుండి 16.5…చరిత్ర సృష్టించిన సినిమాకి 5 ఏళ్ళు!

50 నుండి 280….45 నుండి 16.5…చరిత్ర సృష్టించిన సినిమాకి 5 ఏళ్ళు!

0

దాదాపు పెద్ద సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమే ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి. కానీ అంచనాలను అందుకుంటే భారీ విజయాలుగా లేదా ఫ్లాఫులుగా నిలుస్తాయి, కానీ చిన్న సినిమాల విషయం అలా ఉండదు, వాటి పై అంచనాలు ఉండవు కాబట్టి బాగా ఆడితే టాక్ కి బట్టి కలెక్షన్స్ పెరుగుతూ పోతాయి, ఇక డబ్బింగ్ సినిమాలు చాలా రేర్ గానే అద్బుతాలు సృష్టిస్తూ ఉండాయి.

టాలీవుడ్ లో అలాంటి అద్బుతం సృష్టించిన సినిమాల్లో విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమా చరిత్ర లో నిలిచిపోయే రేంజ్ సినిమా అని చెప్పొచ్చు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా అతి తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి అంచనాలను మించి ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఊహకందని లాభాలను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. తెలుగు లో ఈ సినిమా డబ్ అయ్యి 5 ఏళ్ళు పూర్తీ అయింది, సినిమా ను 5 ఏళ్ల క్రితం కేవలం 45 లక్షల రేటు కి తెలుగు రైట్స్ ని కొని మొత్తం మీద సమ్మర్ టైం కి కేవలం 50 థియేటర్స్ లోపు మాత్రమే థియేటర్స్ దక్కడంతో అందులోనే రిలీజ్ చేశారు.

పోటి లో అప్పటికే రిలీజ్ అయిన మహేష్ బాబు బ్రహ్మోత్సవం ఉండటం తో థియేటర్స్ దక్కలేదు, కానీ ఆ సినిమా ఫ్లాఫ్ అవ్వడం ఈ సినిమా కి కలిసి వచ్చింది, సినిమా టాక్ కూడా అద్బుతంగా ఉండటం తో రోజు రోజుకి థియేటర్స్ ని పెంచుకుంటూ ఏకంగా 7 వ వారానికి వచ్చే సరికి ఏకంగా 280 థియేటర్స్ కి కౌంట్ ని పెంచుకుంది అంటే…

ఏ రేంజ్ లో సినిమా ప్రభంజనం కొనసాగిందో అర్ధం చేసుకోవచ్చు. లాంగ్ రన్ లో తెలుగు రాష్ట్రలలో ఏకంగా 16.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ మూవీస్ లో బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ మూవీ గా నిలిచింది, అతి తక్కువ పెట్టుబడితో అల్టిమేట్ లాభాలను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది ఈ సినిమా….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here