Home టోటల్ కలెక్షన్స్ ఒరేయ్ బామ్మర్ది టోటల్ కలెక్షన్స్…సాలిడ్ దెబ్బ ఇది!

ఒరేయ్ బామ్మర్ది టోటల్ కలెక్షన్స్…సాలిడ్ దెబ్బ ఇది!

0

లవర్ బాయ్ గా తెలుగు లో ఒకప్పుడు వరుస పెట్టి హిట్ మూవీస్ తో దుమ్ము లేపిన హీరో సిద్దార్థ్, ఒక స్టేజ్ లో మంచి మార్కెట్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపాడు, కానీ కొన్ని ఫ్లాఫ్ మూవీస్ ఎఫెక్ట్ వలన ఇండస్ట్రీ పై కొన్ని కామెంట్స్ చేసి కోలివుడ్ కి వెళ్ళిపోయినా సిద్దార్థ్ కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు తెలుగు లో సినిమాలు చేస్తూ బిజీ అవ్వబోతున్నాడు.

ఆల్ రెడీ శర్వానంద్ తో కలిసి మహా సముద్రం సినిమా చేస్తున్న సిద్దార్థ్ అంతకన్నా ముందు బిచ్చగాడు డైరెక్టర్ శశి డైరెక్షన్ లో ఒరేయ్ బామ్మర్ది సినిమాను తెలుగు లోకి తీసుకు రాగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు ఈ మధ్యే వచ్చింది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర…

అంతల ఇంపాక్ట్ ఏమి చూపలేక పోయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ అంత పాజిటివ్ గా ఏమి రాలేదు… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజులకు గాను సినిమా 41 లక్షల గ్రాస్ ను 23 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి ఇప్పుడు…

తెలుగు రాష్ట్రాలలో 56 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని 31 లక్షల దాకా షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది. సినిమాను ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో 1.1 కోట్ల రేంజ్ లో అమ్మినట్లు సమాచారం. ఆ లెక్కన సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే 1.3 కోట్ల దాకా కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది. కానీ రన్ కంప్లీట్ అయ్యే టైం కి ఆల్ మోస్ట్ బిజినెస్ లో…

80 లక్షల మేర నష్టపోయిన ఈ సినిమా నిరాశ పరిచే రిజల్ట్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి. తెలుగు లో సిద్దార్థ్ నుండి ఆశించే కంబ్యాక్ ఇది అయితే కాదనే చెప్పొచ్చు. ఇక సిద్దార్థ్ ఆశలన్నీ కూడా శర్వా తో కలిసి చేస్తున్న మహా సముద్రం మీదే ఉన్నాయని చెప్పాలి. ఆ సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here