మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ గాండీవ ధారి అర్జున(Gandeevadhari Arjuna) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి ఓ రేంజ్ లో నెగటివ్ టాక్ సొంతం అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఇంపాక్ట్ క్లియర్ గా…
కనిపించి అసలు ఏమాత్రం హోల్డ్ చేయలేక వర్కింగ్ డేస్ లో డెఫిసిట్ లు లాంటివి సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ట్రేడ్ లెక్కల ప్రకారం సినిమా ఆల్ మోస్ట్ 50 కోట్ల రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కగా…
బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మాత్రం అందలో 5% కూడా రికవరీని సొంతం చేసుకోలేక పోతుంది ఇప్పుడు. ఇక సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఈ సినిమా కోసం రిలీజ్ కి ముందు ఆల్ మోస్ట్ 10.50 కోట్ల రేంజ్ రేటు చెల్లించి డిజిటల్ రైట్స్ ను…
సొంతం చేసుకోగా ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ను చూసి లాస్ ను తగ్గించుకోవడానికి మేకర్స్ ఎర్లీ డిజిటల్ రిలీజ్ కోసం ట్రై చేస్తున్నారని టాక్ అయితే వినిపిస్తుంది. నెట్ ఫ్లిక్స్ వాళ్ళకి కొంత రేటుని పెంచి రెండు వారాల లోపే డిజిటల్ రిలీజ్ కి ట్రై చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది…
ఓవరాల్ గా డిజిటల్ రైట్స్ అలాగే ఇతర రైట్స్ తో కూడా బడ్జెట్ లో చాలా మొత్తం రికవరీ అయ్యింది అంటున్నా కూడా థియేట్రికల్ రన్ భారీ ఎదురుదెబ్బ కొట్టింది అని చెప్పాలి. ఆ ఇంపాక్ట్ తో ఇప్పుడు ఎర్లీ డిజిటల్ రిలీజ్ కి మేకర్స్ ట్రై చేస్తున్నారు. మరి ఇదే నిజం అయ్యి ఎర్లీ డిజిటల్ రిలీజ్ ఎప్పుడు అవుతుందో చూడాలి.