మొదటి వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన బంగార్రాజు రెండు తెలుగు రాష్ట్రాలలో 38 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 43.80 కోట్ల గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా నాలుగో రోజు పార్షిక హాలిడే అడ్వాంటేజ్ ను సొంతం చేసుకున్న సినిమా నైజాంలో డ్రాప్ అయినా మిగిలిన చోట్ల బాగా హోల్డ్ చేసి సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…
సినిమా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 4 వ రోజు 7 కోట్ల నుండి 7.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కలెక్ట్ చేసే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా కూడా 7.5 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
సినిమా ఈ రోజు కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజులు పూర్తీ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాలలో 45 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ ని అందుకోబోతుండగా వరల్డ్ వైడ్ గా ప్రతిష్టాత్మక 50 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని నాగచైతన్య కెరీర్ లో మరో 50 కోట్ల మూవీ గా నాగార్జున కెరీర్ లో రీసెంట్ టైం లో ఫస్ట్ 50 కోట్ల గ్రాస్ మూవీగా నిలిచింది. ఇక అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి…