Home గాసిప్స్ పేరుకు చిన్న సినిమా కానీ బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా?

పేరుకు చిన్న సినిమా కానీ బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా?

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా సంక్రాంతి రేసులో మిగిలిన సినిమాలతో పోటిలో వచ్చిన సినిమా రౌడీ బాయ్స్… దిల్ రాజు తమ్ముడి కొడుకుని హీరో గా టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ రూపొందిన ఈ సినిమా ను గ్రాండ్ గానే రిలీజ్ చేశారు. గ్రాండ్ గానే ప్రమోషన్స్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు, కానీ సినిమా లో కంటెంట్ ఆడియన్స్ ను అంతలా ఇంప్రెస్….

చేయక పోవడంతో సినిమా కి ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ రాగా పండగ సెలవుల్లో డెబ్యూ హీరో మూవీ అని చూడకుండా చాలా వరకు డీసెంట్ కలెక్షన్స్ నే సినిమా కి దక్కేలా చేశారు కానీ ఓవరాల్ బిజినెస్ వర్త్ ని అందుకోవాలి అన్నా కూడా సినిమా ఇంకా…

బెటర్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా పేరుకు చిన్న సినిమా అన్నారు కానీ ఆల్ మోస్ట్ ఓ మీడియం రేంజ్ మూవీ కి పెట్టె రేంజ్ లో బడ్జెట్ లో సినిమాను నిర్మించారని సమాచారం. ఫస్ట్ మూవీ నే అయినా కానీ…

దిల్ రాజు ఈ సినిమా మీద ఏకంగా 25 కోట్ల రేంజ్ లో బడ్జెట్ ని పెట్టారని, సినిమా ప్రమోషన్స్ కోసం మరో 2 కోట్ల మేర ఖర్చు చేశారని ట్రేడ్ లో టాక్ ఉంది. ఈ రేంజ్ బడ్జెట్ అంటే థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రెండూ కలిపి సాలిడ్ గా రికవరీ అవ్వాలి కానీ థియేట్రికల్ బిజినెస్ లో చాలా వరకు ఓన్ రిలీజ్ కి వాల్యూ తో రిలీజ్ చేయగా…

నాన్ థియేట్రికల్ బిజినెస్ లెక్కలు ఏమి కూడా ఇంకా రివీల్ చేయలేదు. ఓవరాల్ గా సినిమా అన్నీ కలిపినా ఈ బడ్జెట్ ను రికవరీ చేసే అవకాశం చాలా తక్కువే అని చెప్పాలి. కానీ హీరో కి ఓ డీసెంట్ లాంచ్ మూవీల జనాలలో అయితే ఈ సినిమా పేరు వినిపించడం లాంటివి హీరో అప్ కమింగ్ మూవీస్ కి క్రేజ్ ని తేవడానికి యూస్ అవుతుంది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here