మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) సోలో హీరోగా సినిమా చేసి ఆల్ మోస్ట్ 6 ఏళ్ల తర్వాత ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా దేవర(Devara Part1) తో రాగా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 2 వారాలను పూర్తి చేసుకుని మాస్ రచ్చ చేసింది…సినిమా బ్రేక్ ఈవెన్ ని దాటేసి లాభాలను ఓ రేంజ్ లో పెంచుకుంటూ మాస్ రచ్చ చేయగా…
ఇప్పుడు లాభాల పరంగా ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ తో ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది. సోలో హీరోగా ఎన్టీఆర్ కి కెరీర్ లో కొన్ని సాలిడ్ హిట్స్ ఉన్నాయి. కానీ లాభాల పరంగా ఆది సింహాద్రి రేంజ్ లో లాభాలను అందుకున్న సినిమాలు తర్వాత టైంలో..
చాలా తక్కువగా రాగా ఉన్నంతలో మధ్యలో జనతా గ్యారేజ్ మూవీ మంచి లాభాలను సొంతం చేసుకోగా….ఇప్పుడు తన కెరీర్ లో అన్ని సినిమాల రికార్డులను చెల్లాచెదురు చేస్తూ ఇప్పుడు లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ దేవర ఇప్పుడు 2 వారాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 50 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుని ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేయడమే కాదు ఓవరాల్ గా టాలీవుడ్ హిస్టరీలో సైతం ఆల్ టైం హైయెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న మూవీస్ లో ఒకటిగా నిలిచింది…
సినిమా కి ఇంకా దసరా సెలవుల అడ్వాంటేజ్ ఉండనే ఉండటంతో ఈ లాభాల మార్జిన్ ను మరింతగా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది. మొత్తం మీద యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో సోలో హీరోగానే కాకుండా ఓవరాల్ గా టాలీవుడ్ మూవీస్ పరంగా ఎపిక్ ప్రాఫిట్స్ తో రచ్చ చేస్తుంది ఈ సినిమా…