కండల వీరుడు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన కొత్త సినిమా రాధే…. 11 ఏళ్ల క్రితం వచ్చిన పోకిరి హిందీ రీమేక్ వాంటెడ్ కి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమా పై అంచనాలు అయితే ఓ రేంజ్ లోనే ఉన్నాయి అని చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ దగ్గర అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా లాస్ట్ ఇయర్ సమ్మర్ లో రంజాన్ కానుక గా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా….
ఫస్ట్ వేవ్ వలన పోస్ట్ పోన్ అవ్వగా తర్వాత డిజిటల్ రిలీజ్ కి ఎంత భారీ ఆఫర్స్ వచ్చినా కానీ నో చెబుతూ వచ్చిన టీం. ఇక ఈ ఇయర్ సమ్మర్ లో రంజాన్ కానుకగా ఎలాగైనా రిలీజ్ చేయాలనీ డిసైడ్ అవ్వగా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ పీక్స్ లో ఉండటం తో…
ఇక చేసేది ఏమి లేక సినిమాను గంపగుత్తుగా జీ నెట్ వర్క్ వాళ్లకి ఏకంగా 250 కోట్ల రేటు కి అమ్మి పే పెర్ వ్యూ పద్దతిలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా టీం మీడియా తో మాట్లాడుతూ సినిమా ను థియేటర్స్ లో రిలీజ్ చేయలేక పోతున్నామని…
అందువల్ల నష్టాలు ఎదురు అయినా కానీ నా సినిమా వల్ల ఆడియన్స్ ఎవ్వరికీ కరోనా రావొద్దని సినిమాను డిజిటల్ రిలీజ్ చేస్తున్నామని చెప్పుకొచ్చాడు సల్మాన్ ఖాన్. కానీ ఇక్కడ అర్ధం కానీ విషయం ఏంటంటే… సినిమా సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ కాకుండానే 50 కోట్ల బడ్జెట్ లో రూపొంది 250 కోట్ల బిజినెస్ ని అన్నీ కలుపుకుని చేసింది. ఇంకా నష్టం అంటారేంటి అంటూ బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.
కొందరు విశ్లేషకులు సల్మాన్ చెప్పింది, థియేటర్స్ లో రిలీజ్ చేస్తే భారీ వసూళ్లు వచ్చే సినిమాను ఇలా ఈ విధంగా రిలీజ్ చేయడం కొద్ది నష్టాలను తెస్తున్నందున ఇలాంటి కామెంట్స్ చేశారని అంటున్నారు. అది కూడా ఒకింత నిజమే, నార్మల్ టైం లో అయ్యి ఉంటే… థియేట్రికల్ బిజినెస్ 120 కోట్ల నుండి 150 కోట్ల రేంజ్ లో… డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ కింద మరో 150 కోట్లు మినిమమ్ దక్కేవి… ఆ విధంగా కొద్దిగా నష్టాలూ వచ్చి ఉండొచ్చు.