బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మూడు వారాలను పూర్తీ చేసుకోగా సినిమా మూడో వారంలో స్లో డౌన్ అయింది. వర్కింగ్ డేస్ లో మరీ ఎక్కువగా స్లో అయిన సినిమా 4వ వారంలో థియేటర్స్ ని చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది. ఇక సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో భారీ లాభాలను అందుకోగా….
3 వారాలు పూర్తీ అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో సినిమా 113.52 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా సినిమా మిగిలిన రన్ లో మరో 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే బాహుబలి1 రికార్డ్ కలెక్షన్స్ బ్రేక్ కాబోతుందని చెప్పాలి.
2015 టైంలో వచ్చిన బాహుబలి 1 సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఫైనల్ రన్ లో… 114 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది… ఆ రికార్డ్ ను తర్వాత బాహుబలి2, అల వైకుంఠ పురంలో, సరిలేరు నీకెవ్వరు మరియు RRR సినిమాలు బ్రేక్ చేశాయి. ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఈ సినిమాల తర్వాత వాల్తేరు వీరయ్య సినిమా బాహుబలి1 ని బ్రేక్ చేయడానికి మరో 50 లక్షల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా 4వ వారంలో ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. ఓవరాల్ గా మెగాస్టార్ ఊరమాస్ కంబ్యాక్ తో దుమ్ము దులిపేశాడు అని చెప్పాలి.
once waltair veerayya cross Bhahubali-1 Record, but the movie can not hyping like Bhahubali
Na bachu am lee bahubali ni datdam kastam
Pandi baliste enugu avvadu