Home న్యూస్ అక్షరాలా 50M….రికార్డులు క్రియేట్ చేస్తున్న చిన్న సినిమా!

అక్షరాలా 50M….రికార్డులు క్రియేట్ చేస్తున్న చిన్న సినిమా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో మంచి జోరు మీద ఉన్న యంగ్ హీరో సుహాస్(Suhas) నటించిన లేటెస్ట్ మూవీ ప్రసన్న వదనం(Prasanna Vadanam) సినిమా కూడా ఒకటి…సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుండి ఎబో యావరేజ్ రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా…

కలెక్షన్స్ పరంగా మాత్రం అనుకున్న రేంజ్ లో హోల్డ్ ని చూపించ లేక పోయింది. ఎలక్షన్స్  అండ్ IPL మ్యాచుల వలన రన్ త్వరగానే కంప్లీట్ అయింది, కానీ మంచి సినిమా అన్న పేరు వచ్చిన ప్రసన్న వదనం సినిమా రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుని డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది…

ఆహా వీడియోలో సినిమా డిజిటల్ రిలీజ్ సొంతం చేసుకోగా OTT రిలీజ్ తర్వాత ఆడియన్స్ నుండి రెస్పాన్స్ సూపర్ పాజిటివ్ గా సొంతం చేసుకున్న ప్రసన్న వదనం సినిమా కి ఇక్కడ వ్యూవర్ షిప్ సాలిడ్ గా పెరిగి పోగా ఓవరాల్ గా సినిమా ఆహ వీడియో ప్లాట్ ఫామ్ లో ఫాస్టెస్ట్ 50 మిలియన్ యూనిక్ 1 మినట్ వాట్చ్ టైం ను సొంతం చేసుకుని…

రికార్డ్ కొట్టిందట….అఫీషియల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా సినిమాను చూడని వాళ్ళు కూడా ఇప్పుడు ఎగబడి సినిమాను చూడటానికి సిద్ధం అవుతున్నారు…. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన మేర సక్సెస్ అవ్వలేక పోయిన ప్రసన్న వదనం సినిమా ఇప్పుడు డిజిటల్ లో మాత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here