Home గాసిప్స్ చిన్న సినిమా అనుకున్నారు….రాజు యాదవ్ బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా!

చిన్న సినిమా అనుకున్నారు….రాజు యాదవ్ బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో గెటప్ శీను(Getup Srinu) మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ రాజు యాదవ్(Raju Yadav) సినిమా ఒకటి కాగా, గెటప్ శీను పెర్ఫార్మెన్స్ కి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ అయితే సొంతం అయ్యింది అని చెప్పాలి. తన నటన అద్బుతంగా ఉన్నప్పటికీ…

సినిమా రొటీన్ గా అనిపించగా ఓవరాల్ గా సినిమా కి ఆడియన్స్ నుండి రెస్పాన్స్ మిక్సుడ్ గానే సొంతం అయ్యింది…అయినా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నంతలో వీకెండ్ లో పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసింది. ఈ సినిమా ముందు చిన్న సినిమాగానే అనుకున్నా కూడా బడ్జెట్ ఓవరాల్ గా బాగానే అయిందని తెలుస్తుంది…

ముందు 1 కోటి నుండి 1.30 లక్షల రేంజ్ లో రూపొందించాలి అనుకున్నా కూడా సినిమా కొంచం డిలే అవుతూ తర్వాత పబ్లిసిటీ మరియు ఇతర ఖర్చులతో కలిపి ఆల్ మోస్ట్ 3.5-4 కోట్ల మద్యలో బడ్జెట్ అయిందని అంటున్నారు..దాంతో లో బడ్జెట్ మూవీ అనుకున్నా కూడా ఓవరాల్ గా లెక్క పెరిగిపోయింది.

ఇక మేకర్స్ కి సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మంచి రేటే సొంతం అయ్యింది అని అంటూ ఉండగా వాటి లెక్కలు ఇంకా క్లియర్ గా తెలియాల్సి ఉంది. ఓవరాల్ గా సినిమా ద్వారా మేకర్స్ డీసెంట్ ప్రాఫిట్ లోనే ఉండే అవకాశం ఉందని అంటూ ఉండగా థియేట్రికల్ రన్ లో లాంగ్ రన్ లో ఎంతో కొంత జోరుని సినిమా చూపిస్తుందో లేదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here