టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మెగాస్టార్ కి మెగా కంబ్యాక్ బ్లాక్ బస్టర్ గా నిలిచి దుమ్ము లేపగా సినిమా టాలీవుడ్ లో కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లో ఒకటిగా నిలిచి సంచలనం సృష్టించింది. 2 ఫ్లాఫ్స్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కి ఎపిక్ కంబ్యాక్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు మొత్తం మీద…
బాక్స్ ఆఫీస్ దగ్గర 50 రోజులను పూర్తీ చేసుకుని దుమ్ము లేపింది. సినిమా తెలుగు రాష్ట్రాలలో 69 డైరెక్ట్ సెంటర్స్ లో టోటల్ గా 74 డైరెక్ట్ మరియు 115 వరకు షిఫ్ట్ సెంటర్స్ లో 50 రోజులను జరుపుకోగా 50 వ రోజు వేడుకలు కూడా ఘనంగానే జరిగాయి ఈ సినిమా కి…
తెలుగు రాష్ట్రాలలో పలు చోట్ల సినిమా కి 50వ రోజు మంచి ఆక్యుపెన్సీ లభించగా కొన్ని చోట్ల ఏకంగా హౌస్ ఫుల్ బోర్డులు కూడా కనిపించడం బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ రాంపేజ్ కి నిదర్శనం అని చెప్పాలి. సంక్రాంతి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో కూడా ఒకటిగా నిలిచిన…
వాల్తేరు వీరయ్య లాంగ్ రన్ ని సొంతం చేసుకుని షేర్స్ ని ఎక్కువ రోజులు సొంతం చేసుకుంది, మొత్తం మీద ఎపిక్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్న మెగాస్టార్ రిలీజ్ అయిన రోజు నుండి 50వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి కంబ్యాక్ పరంగా వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అనిపించుకున్నాడు.