బాక్స్ ఆఫీస్ దగ్గర నాగార్జున నాగ చైతన్య ల లేటెస్ట్ మూవీ బంగార్రాజు పక్కా సంక్రాంతి మూవీగా రిలీజ్ అయ్యి పండగ సెలవుల్లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసింది. కానీ 3rd వేవ్ ఇంపాక్ట్ వలనో లేక సినిమా కి మరీ అనుకున్న రేంజ్ టాక్ రాక పోవడం వలనో కానీ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి సినిమా…
కలెక్షన్స్ పరంగా చాలా వరకు స్లో డౌన్ అయింది అని చెప్పాలి. ముఖ్యంగా నైజాం ఏరియాలో సినిమా అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా స్లో డౌన్ అవ్వగా ఉన్నంతలో కోస్టల్ ఆంధ్రలో సీడెడ్ లో పర్వాలేదు అనిపించేలా ప్రదర్శనని కొనసాగిస్తుంది బంగార్రాజు సినిమా. ఇక సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షల లోపు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకుంటే 46 లక్షల తో పర్వాలేదు అనిపించేలా గ్రోత్ ని చూపెట్టి 5 లక్షలు మాత్రమే డ్రాప్ అవ్వడంతో వీకెండ్ లో మళ్ళీ బ్యాటింగ్ చేసే అవకాశం ఉండగా మొత్తం మీద బంగార్రాజు 8 రోజుల్లో…
టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉందని చెప్పాలి…
👉Nizam: 7.67Cr
👉Ceeded: 6.01Cr
👉UA: 4.47Cr
👉East: 3.61Cr
👉West: 2.58Cr
👉Guntur: 3.07Cr
👉Krishna: 1.98Cr
👉Nellore: 1.55Cr
AP-TG Total:- 30.94CR(50.02Cr~ Gross)
👉Ka+ROI: 1.63Cr
👉OS – 1.37Cr
Total WW: 33.94CR(56.80CR~ Gross)
ఇదీ సినిమా 8 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క..
సినిమాను మొత్తం మీద 38.15 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 39 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 8 రోజుల తర్వాత బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇంకా 5.06 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ శని ఆదివారాల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.