Home న్యూస్ 23 కోట్ల బడ్జెట్….హీరో మూవీ బిజినెస్ ఎంత…ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే!!

23 కోట్ల బడ్జెట్….హీరో మూవీ బిజినెస్ ఎంత…ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతూ చేసిన మొదటి సినిమా హీరో రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సంక్రాంతి రేసులో పాన్ ఇండియా మూవీస్ రేసు నుండి తప్పుకున్న తర్వాత బంగార్రాజు కి పోటిగా రౌడీ బాయ్స్ మరియు హీరో సినిమాలు బరిలోకి దిగాయి కానీ ఏ సినిమా కూడా పాజిటివ్ టాక్ ఆడియన్స్ నుండి రాలేదు…

ఉన్నంతలో హీరో సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ కొంచం వర్కౌట్ అయినా కానీ చాలా లిమిటెడ్ రిలీజ్ అవ్వడం అలాగే, ఫ్యామిలీలో జరిగిన ఇంసిడెంట్స్ వలన సినిమా కి పెద్దగా ప్రమోషన్స్ లాంటివి చేయక పోవడం లాంటివి సినిమా కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపాయి..

మొదటి 2 రోజులు పండగ సెలవుల్లో బాగానే కలెక్షన్స్ ని రాబట్టిన ఈ సినిమా తర్వాత వర్కింగ్ డేస్ లో చేతులు ఎత్తేసింది. మొత్తం మీద 23 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి ఏరియాల వారిగా గమనిస్తే…

👉Nizam: 64L
👉Ceeded: 31L
👉UA: 36L
👉East: 16L
👉West: 10L
👉Guntur: 12L
👉Krishna: 11L
👉Nellore: 8L
AP-TG Total:- 1.88CR(3.55CR~ Gross)
👉Ka+ROI: 0.08Cr
👉OS – 0.10Cr
Total WW: 2.06CR(4CR~ Gross)
ఈ కలెక్షన్స్ కూడా ట్రేడ్ లెక్కల ప్రకారం రిలీజ్ అయిన కలెక్షన్స్… అఫీషియల్ గా కొన్ని ఏరియాలలో తప్పితే అన్ని ఏరియాలలో కలెక్షన్స్ రిలీజ్ కాలేదు…

ఇక సినిమా బిజినెస్ ట్రేడ్ లెక్కల ప్రకారం 5.5 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం, బాక్స్ ఆఫీస్ దగ్గర 6 కోట్ల దాకా కలెక్షన్స్ ని రాబట్టాల్సిన అవసరం ఉండగా సినిమా ఫస్ట్ వీక్ తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 3.94 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సెకెండ్ వీక్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇక..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here