మొదటి వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రికార్డులను తిరగరాసిన ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విచారకరం అని చెప్పాలి ఇప్పుడు…
సినిమా రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ తర్వాత వర్కింగ్ డేస్ లో అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం చాలా చాలా కష్టం అయిపొయింది అని చెప్పాలి. సినిమా బాక్స్ అఫీస్ దగ్గర 5వ రోజున…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా 5వ రోజు 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా 2.82 కోట్ల రేంజ్ లోనే షేర్ ని సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా 8 కోట్లకు పైగా షేర్ ని అందుకుంటుంది అనుకుంటే 7.29 కోట్ల షేర్ ని అందుకుంది సినిమా…
దాంతో సినిమా టోటల్ గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 33.22Cr
👉Ceeded: 8.56CR
👉UA: 9.28Cr
👉East: 5.40Cr
👉West: 3.79Cr
👉Guntur: 6.26Cr
👉Krishna: 4.06Cr
👉Nellore: 2.01Cr
AP-TG Total:- 72.58CR(115.30Cr~ Gross)
👉Karnataka: 11.15Cr
👉Tamilnadu: 2.15Cr
👉Kerala: 0.76Cr
👉Hindi+ROI: 61.90Cr~
👉OS – 22.20Cr~
Total WW: 170.74CR(343.00CR~ Gross)
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 242 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 71.26 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…