బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీలో మన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఛత్రపతి సినిమాను రీమేక్ చేయగా సినిమా ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. మొదటి రోజు నుండే అంచనాలను అందుకోలేక పోయిన సినిమా వీకెండ్ లోనే చేతులు ఎత్తేయగా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన సినిమా సగానికి పైగా థియేటర్స్ ని కోల్పోయింది ఇప్పుడు.
ఇక వీకెండ్ లోనే సినిమా కోటి లోపు నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత 4వ రోజు ఇండియాలో 7 లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా 5వ రోజున 5 లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా టోటల్ గా 5 రోజుల్లో ఇప్పుడు….
1.12 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. టోటల్ గా వర్త్ షేర్ 45 లక్షల లోపే ఉంటుందని అంటున్నారు. వర్కింగ్ డేస్ లో షేర్ పెద్దగా ఏమి సొంతం చేసుకోలేక పోయింది ఈ సినిమా… భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా…
ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేక 10% రికవరీ కాదు కదా 5% కూడా రికవరీని కూడా సొంతం చేసుకోలేక పోయింది ఇప్పుడు. బాలీవుడ్ లో ఈ సినిమాతో మంచి ఎంట్రీ ఇవ్వాలని ఆశ పడ్డ బెల్లంకొండ శ్రీనివాస్ కి సినిమా తీవ్రమైన నిరాశని మిగిలించింది అని చెప్పాలి.