బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో విశ్వక్ సేన్(vishwak sen) నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari Movie) సినిమా మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ నే వీకెండ్ లో దక్కించుకుంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలా హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా….
మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా సినిమా వర్కింగ్ డేస్ లో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా 5వ రోజున ఎలక్షన్స్ రిజల్ట్స్ వలన అందరూ ఫుల్ బిజీగా ఉన్నా కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మాత్రం 7.7 వేల దాకా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మాస్ సెంటర్స్ లో బాగానే హోల్డ్ ని కొనసాగించింది…
మొత్తం మీద 5వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 45 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 51 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 1 కోటి రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. టోటల్ గా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Gangs Of Godavari 5 Days Total World Wide Collections Report
👉Nizam: 2.98Cr
👉Ceeded: 1.49Cr
👉UA: 90L
👉East: 61L
👉West: 47L
👉Guntur: 54L
👉Krishna: 46L
👉Nellore: 33L
AP-TG Total:- 7.78CR(13.45CR~ Gross)
👉KA+ROI: 0.55Cr
👉OS: 1.05Cr
Total WW:- 9.38CR (17.10CR~ Gross)
మొత్తం మీద 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా 1.62 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా వర్కింగ్ డేస్ లో హోల్డ్ ని ఇలానే కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం ఖాయం. ఇక 17 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకున్న సినిమా మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.