Home న్యూస్ హిట్ రివ్యూలు….5 రోజుల కలెక్షన్స్ ఇవే….షోలు కాన్సిల్….టికెట్ ఆఫర్స్ వర్క్ అవ్వట్లేదు!

హిట్ రివ్యూలు….5 రోజుల కలెక్షన్స్ ఇవే….షోలు కాన్సిల్….టికెట్ ఆఫర్స్ వర్క్ అవ్వట్లేదు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ సూపర్ స్టార్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar) వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతూ రీసెంట్ గా ఎట్టకేలకు OMG2 సినిమాతో సాలిడ్ హిట్ కొట్టగా ఈ సినిమా తర్వాత వెంటనే ఆడియన్స్ ముందుకు ఇప్పుడు మిషన్ రాణిగంజ్(Mission Raniganj)…

అంటూ కొత్త సినిమాను రీసెంట్ గా రిలీజ్ చేశాడు… సినిమా ట్రైలర్ బాగున్నా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసే విషయంలో విఫలం అయింది. ఇక సినిమాకి పాజిటివ్ టాక్ ఒక్కటే హెల్ప్ చేస్తుంది అనుకోగా అనుకున్నట్లే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

కానీ అవేవి కూడా కలెక్షన్స్ పరంగా సినిమా జోరు చూపించడానికి ఏమాత్రం హెల్ప్ అవ్వలేదు అనే చెప్పాలి. సినిమా మొదటి రోజు 2.8 కోట్లు, రెండో రోజు 4.8 కోట్లు, మూడో రోజు 5 కోట్లు వసూల్ చేయగా వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి సినిమా…

1.5 కోట్ల నెట్ కలెక్షన్స్ ని 4వ రోజు 1.20 కోట్ల నెట్ కలెక్షన్స్ ని 5వ రోజు అందుకోగా టోటల్ గా 5 రోజుల్లో 15.30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా 6వ రోజు కోటి లోపే నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా…

మొదటి వారం నెట్ కలెక్షన్స్ 17 కోట్ల రేంజ్ లోనే ఉండే అవకాశం ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా భారీ డిసాస్టర్ గా నిలవబోతుంది. సినిమాకి టాక్ పాజిటివ్ గా వచ్చినా కూడా కలెక్షన్స్ పరంగా సినిమా ఏమాత్రం హోల్డ్ ని చూపించలేక పోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here