బాక్స్ ఆఫీస్ దగ్గర రాధే శ్యామ్ సినిమా వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన తర్వాత అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తుంది. సినిమా నాలుగో రోజు అసలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అవ్వగా సినిమా ఇప్పుడు…
ఆల్ మోస్ట్ 4 వ రోజు తో పోల్చితే 5 వ రోజు ఓవరాల్ గా 35% టు 40% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై కూడా భారీగా డ్రాప్స్ ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉందని చెప్పాలి. ఇక సినిమా హిందీ లో కూడా మరింత డ్రాప్ అవ్వగా హిందీ లో కోటి రేంజ్ లో…
నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా 1.3 కోట్ల నుండి 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది, అది కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటేనే సాధ్యం అవుతుంది అని చెప్పాలి. ఇది మామూలు దెబ్బ కాదు… బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక సినిమా తేరుకోవడం కష్టమే అని చెప్పాలి.