యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ సాహో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 4 రోజుల్లో అంచనాలకు మించి కలెక్షన్స్ ని సాధించింది. సినిమా టోటల్ గా 167 కోట్ల లోపు షేర్ ని 312 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకోగా నిర్మాతలు 330 కోట్ల దాకా గ్రాస్ అందుకుందని అనౌన్స్ చేశారు. ఇక నాలుగు రోజుల సెన్సేషనల్ కలెక్షన్స్ జోరు 5 వ రోజు భారీ గా తగ్గి షాక్ ఇచ్చింది.
డానికి కారణాలు 2 ఉన్నాయని చెప్పాలి, ఒకటి పక్కా వర్కింగ్ డే అవ్వడం, అలాగే టికెట్ రేట్లు అస్సలు తగ్గించక పోవడం, టాక్ మొత్తం స్ప్రెడ్ అవ్వగా అంత భారీ రేట్లు పెట్టి థియేటర్స్ కి వర్కింగ్ డేస్ లో వెళ్ళే వాళ్ళు చాలా చాలా తక్కువ. కానీ నిర్మాతలు టికెట్ రేట్లు 2 వారాల పాటు తగ్గించే ఆలోచన లో లేరు.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు తో పోల్చితే 5 వ రోజు డ్రాప్స్ చాలా హెవీ గానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 60% కి పైగా డ్రాప్స్ ఉన్నాయట, ఈవినింగ్ అండ్ నైట్ షోల కి కొన్ని చోట్ల తప్పితే మిగిలిన చోట్ల కలెక్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయని సమాచారం.
దాంతో సినిమా 5 వ రోజున తెలుగు రాష్ట్రాలలో 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని సమాచారం, ఇక హిందీ లో కూడా కలెక్షన్స్ తగ్గగా 6 కోట్ల నుండి 7 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ రావచ్చట. ఇక మిగిలిన చోట్ల మొత్తం మీద 2 కోట్ల లోపు షేర్ ని…
అందుకునే అవకాశం ఉందట. మొత్తం మీద 5 వ రోజు వరల్డ్ వైడ్ గా 9 కోట్లకు పైగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. అంటే సినిమా ఆల్ మోస్ట్ 60% కి పైగా డ్రాప్స్ ని సొంతం చేసుకున్నట్లే… మరి అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.