Home న్యూస్ మెగాస్టారా…మజాకా…20 గంటల్లో అవగొట్టాడు!!

మెగాస్టారా…మజాకా…20 గంటల్లో అవగొట్టాడు!!

0

     10 ఏళ్ళు వెండితెరకు దూరం అయినా తనదైన స్టైల్ లో ఖైదీ నంబర్ 150 తో సెన్సేషనల్ కంబ్యాక్ తో 100 కోట్లకు పైగా షేర్ ని అందుకుని ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసిన హీరో మెగాస్టార్ చిరంజీవి, బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా అల్టిమేట్ విజయం సొంతం చేసుకోగా తన తర్వాత సినిమా సైరా ని ఏకంగా రెండున్నర ఏళ్లుగా తెరకెక్కిస్తున్న మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే సినిమా ను ప్రేక్షకుల ముందుకు తేనున్నాడు.

రీసెంట్ గా రిలీజ్ అయిన టీసర్ 2 అంచనాలను మరింతగా పెంచేయగా ఇప్పుడు సినిమా కోసం అందరు ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా సినిమా షూటింగ్ పూర్తీ అవ్వగా గ్రాఫిక్స్ పనులు కూడా పూర్తీ అయ్యయట, ఇక సినిమాలో అందరు తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పుకునే పనిలో ఉన్నారట.

ముందుగా మెగాస్టార్ తన పాత్ర తాలూకు డబ్బింగ్ ని పూర్తీ చేయగా కేవలం 20 గంటలు ముగిసే సరికే తన పాత్ర తాలుకు పూర్తీ డబ్బింగ్ ని మెగాస్టార్ కంప్లీట్ చేశారట. ఈ ఏజ్ లో కూడా తన వర్క్ పై డెడికేషన్ ని ఇంతలా చూపుతున్న మెగాస్టార్ ని ప్రతీ ఒక్కరు మెచ్చుకుంటున్నారు.

ఇక సినిమా లో మిగిలిన పాత్రల డబ్బింగ్ పనులు కూడా మొదలు అయినట్లు సమాచారం, దాంతో పాటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జోరు అందుకోగా సినిమా అక్టోబర్ 2 న ఎలాంటి ఆటంకాలు లేకుండా భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

ఏమాత్రం పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా అన్ని ఏరియాల్లో రికార్డ్ లెవల్ కలెక్షన్స్ తో సినిమా భీభత్సం సృష్టించే అవకాశం పుష్కలంగా ఉంటుంది, ఇక త్వరలోనే సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here