మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ రాంపేజ్ మొదలు అయింది, తొలి రోజు తప్పితే మిగిలిన 3 రోజుల్లో 2 రోజులు వర్కింగ్ డేస్ అయినా కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ గా హోల్డ్ చేసిన సైరా నరసింహా రెడ్డి 4 వ రోజు మళ్ళీ జోరు చూపి సాలిడ్ గా హోల్డ్ చేసి మంచి వసూళ్ళ ని దక్కించుకుంది. ఇక సినిమా ఇప్పుడు 5 వ రోజు లో ఎంటర్ అవ్వగా అన్ని చోట్లా కలెక్షన్స్…
సాలిడ్ గా ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలలో…. 4 వ రోజు తో పోల్చుకుంటే 5 వ రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల డ్రాప్స్ కేవలం 5% కన్నా తక్కువే ఉండటం తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు సాలిడ్ కలెక్షన్స్ ని అందుకోవడం ఆల్ మోస్ట్ కన్ఫాం అయ్యింది అనే చెప్పాలి.
కాగా ఈవినింగ్ అండ్ నైట్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ ఆన్ లైన్ సాలిడ్ గా జరుగుతున్నాయి, నైజాం లో బతుకమ్మ పండగ ఉండటం తో కొంచం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నా అక్కడ కూడా బుకింగ్స్ బాగున్నాయి. ఇక టోటల్ ఆంధ్రా లో సాలిడ్ గా బుకింగ్స్ కొనసాగుతున్నాయి.
దాంతో 5 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా మినిమం 7 కోట్ల రేంజ్ కి తగ్గని కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయమని చెప్పొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ గా హోల్డ్ చేసిన సినిమా మిగిలిన చోట్లా మాత్రం పూర్తీ విరుద్దంగా ఓపెనింగ్స్ లేక చతికిల పడింది. మిగిలిన అన్ని చోట్ల లో కర్ణాటక మరియు ఓవర్సీస్ తప్పితే…
హిందీ, తమిళ్, కేరళ ఏరియాల్లో మినిమం కలెక్షన్స్ కూడా సినిమా సొంతం చేసుకోవడం లేదు. దాంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలే సినిమా కి మేజర్ కలెక్షన్స్ ని తెచ్చి పెట్టాల్సిన అవసరం నెలకొనగా సినిమా అదే విధంగా దూసుకు పోతుంది. మరి రోజు ముగిసే సరికి మిగిలిన చోట్ల ఏమైనా గ్రోత్ ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.