నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ సెన్సేషనల్ కలెక్షన్స్ తో బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా సినిమా రిలీజ్ అయ్యి 5 వ వారం లో ఉండగా సినిమా ఇప్పటికీ లిమిటెడ్ థియేటర్స్ లోనే పరుగును కొనసాగిస్తూ ఎక్కడా కూడా డెఫిసిట్ లు పడకుండా పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
5వ వారంలో ఉండగా ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాల పరిస్థితి వలన తక్కువ థియేటర్స్ లో రన్ అవుతున్న అఖండకి ఇప్పటికీ ఆక్యుపెన్సీ బాగా ఉండటంతో కొన్ని చోట్ల థియేటర్స్ ని కూడా పెంచుతున్నారు, ఫస్ట్ టైం నైజాంలో కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపిన బాలయ్య…
కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని ఇక్కడ సొంతం చేసుకోగా ఇప్పటికీ ఇక్కడ స్క్రీన్స్ ని థియేటర్స్ ని పెంచుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సంక్రాంతి వరకు కూడా అఖండ బాక్స్ ఆఫీస్ రన్ ఇలానే కొనసాగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మిగిలిన రన్ లో సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.