ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ స్కంద(Skanda Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఫస్ట్ డే తర్వాత డే 2 అండ్ డే 3 కలెక్షన్స్ పరంగా స్లో అయినా కూడా 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం మంచి జోరును చూపించింది.
ఇక సినిమాకి 5 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు రెండు మూడు రోజులతో పోల్చితే బెటర్ గా 4 వ రోజు తో పోల్చితే కొంచం తక్కువగా ఆన్ లైన్ అండ్ ట్రాక్ చేసిన ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఉండటంతో సినిమా మొత్తం మీద…
5వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అటూ ఇటూగా 3.7 కోట్ల రేంజ్ నుండి 3.9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 4 కోట్ల మార్క్ ని మించే అవకాశం ఉంది.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజున 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకునే అవకాశం ఉంది, సినిమా కనుక 4వ రోజు రేంజ్ లో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో సాలిడ్ గ్రోత్ ఉంటే ఈ కలెక్షన్స్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది…
కానీ నైట్ షోలకు నైజాంలో కొంచం డ్రాప్స్ ఉండే అవకాశం ఉండగా ఆంద్ర సీడెడ్ లో మాత్రం మంచి హోల్డ్ నే చూపిస్తుంది. ఓవర్సీస్ లో కొంచం స్లో అయిన సినిమా మొత్తం మీద ఇప్పుడు 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటుందో చూడాలి.