కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించ లేక… అందుకోవాల్సిన టార్గెట్ కి ఇప్పుడు చాలా దూరం లోనే ఆగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉండగా వీకెండ్ లో అసలు ఏమాత్రం గ్రోత్ ని కూడా సినిమా చూపించక పోవడం విచారకరం అనే చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు భారీ నష్టాలను సొంతం చేసుకోవడం ఇక ఖాయమనే చెప్పాలి.
మొత్తం మీద 4వ రోజు తో పోల్చితే 5 వ రోజు ఆల్ మోస్ట్ 20% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా ఈ డ్రాప్స్ తో సినిమా ఇప్పుడు 5వ రోజు 25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునేలా కనిపిస్తుంది. ఇది సినిమా బిజినెస్ లో సగం కూడా అందుకోవడానికి సరిపోదు…
మొత్తం మీద సినిమా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం ఉంది కానీ బ్రేక్ ఈవెన్ ని అందుకోవడానికి అసలు ఈ కలెక్షన్స్ ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి బాక్స్ అఫీస్ దగ్గర ఇప్పుడు.
వీకెండ్ లోనే సినిమా పరిస్థితి ఇలా ఉంటె ఇక వర్కింగ్ డేస్ లో మరింత క్షీణించే అవకాశం ఉంది, ఏదైనా అద్బుతం జరిగితే నష్టాలు కవర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కానీ సినిమా హోల్డ్ చూస్తుంటే అది కూడా కష్టమే అని అని చెప్పాలి. ఇక 5 రోజుల టోటల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.