మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా లాంగ్ వీకెండ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసిన కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా, వీకెండ్ ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వగా ఎలాంటి హోల్డ్ ని చూపెడుతుంది అన్నది…
ఆసక్తిగా మారగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో, కేరళలో సాలిడ్ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా తమిళనాడులో మాత్రం ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతుంది. అలాగే ఓవర్సీస్ లో కూడా ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను మరోసారి చూపెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.
తెలుగులో 80% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా ఈ డ్రాప్స్ ఉండగా ఓవరాల్ గా సినిమా 20-25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా తమిళనాడులో ఓవరాల్ గా 55% రేంజ్ లో ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో…
డ్రాప్స్ ఉండగా ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా తమిళనాడులో 12-13 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక, హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో పర్వాలేదు అనిపిస్తూ ఉండగా ఓవర్సీస్ లో మరోసారి మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా…
టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 22-24 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద వర్కింగ్ డే లో సినిమా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసింది. ఇక టోటల్ గా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.