Home న్యూస్ 5th వీక్ లో కల్కి థియేటర్స్ కౌంట్…పోటిలో మాస్ హోల్డ్ సామి ఇదీ!

5th వీక్ లో కల్కి థియేటర్స్ కౌంట్…పోటిలో మాస్ హోల్డ్ సామి ఇదీ!

0
Kalki 2898 AD Movie 5th Week Theaters Count World Wide
Kalki 2898 AD Movie 5th Week Theaters Count World Wide

వారం వారం కొత్త సినిమాలు వస్తున్నా కూడా స్టడీ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) బ్లాక్ బస్టర్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) నాలుగో వారంలో కొత్త సినిమాల నుండి పోటిలో సాలిడ్ కలెక్షన్స్ తో హోల్డ్ ని కొనసాగించగా…ఇప్పుడు 4వారాలను పూర్తి చేసుకుని 5వ వారంలో…

అడుగు పెట్టిన కల్కి మూవీ ఒక పక్క హాలీవుడ్ బిగ్గీ డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ మరియు మరో పక్క రాయన్ మూవీస్ లు బరిలో ఉండగా ఎన్ని థియేటర్స్ లో ఇప్పుడు 5వ వారాన్ని హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా నైజాం ఏరియాలో 5వ వారంలో ఇప్పుడు కల్కి మూవీ…

80 కి పైగా థియేటర్స్ ని హోల్డ్ చేయగా ఆంధ్ర మరియు సీడెడ్ లలో కలిపి 150 కి పైగా థియేటర్స్ ని హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తూ ఉండగా మొత్తం మీద 5వ వారంలో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 230 కి పైగా థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది. కొత్త సినిమాల రిజల్ట్ ను బట్టి…

Kalki 2898 AD 27 Days Total World Wide Collections!!

థియేటర్స్ లెక్క 250 వరకు ఉండే అవకాశం ఉండగా నాలుగో వారంతో పోల్చితే 80 వరకు థియేటర్స్ మాత్రమే డ్రాప్ అయ్యాయి తెలుగు రాష్ట్రాల్లో. ఇక హిందీలో సినిమా 400 వరకు స్క్రీన్స్ లో పరుగును కొనసాగిస్తుంది సినిమా…రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 75 వరకు థియేటర్స్ లో రన్ కానుంది…

ఓవరాల్ గా 5వ వారంలో ఇండియా లో సినిమా 700 కి పైగా థియేటర్స్ లో రన్ కానుండగా ఓవర్సీస్ లో కలిపి సినిమా 850 కిపైగానే థియేటర్స్ లో రన్ కానున్న సినిమా 4వ వారంతో పోల్చితే 700 వరకు థియేటర్స్ తగ్గాయి. 5వ వారంలో కూడా కొత్త సినిమాల పోటిలో మంచి హోల్డ్ ని చూపించిన కల్కి ఇక కలెక్షన్స్ పరంగా ఈ వారంలో ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో చూడాలి.

Kalki 2898 AD 3 Weeks(21 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here