Home న్యూస్ ఐదు సార్లు 400….సౌత్ చరిత్రలో ప్రభాస్ ఒక్కడే తోపు తురం!

ఐదు సార్లు 400….సౌత్ చరిత్రలో ప్రభాస్ ఒక్కడే తోపు తురం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేయగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా మమ్మోత్ 400 కోట్లు దాటేసి సంచలనం సృష్టించి మాస్ ఊచకోత కోసింది…

టాలీవుడ్ చరిత్రలోనే మరెవ్వరికీ సాధ్యం కాని విధంగా ఏకంగా 5 సార్లు బాక్స్ ఆఫీస్ దగ్గర 400 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించాడు ప్రభాస్…. మిగిలిన హీరోలు ఏడాదికి ఒకటి అరా మూవీస్ చేయడానికే కష్టపడుతూ ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ మూవీస్ తో దుమ్ము లేపుతున్న రెబల్ స్టార్ ప్రభాస్…

ఒక్క రాదే శ్యామ్ సినిమాతో తప్పితే రీసెంట్ టైంలో చేసిన అన్ని సినిమాలతో అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా బాహుబలి సిరీస్, సాహో, సలార్ మరియు ఇప్పుడు కల్కి సినిమాలతో 400 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించాడు. మిగిలిన హీరోలు అసలు ప్రభాస్ దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం…

అదే టైంలో ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీ వరకే కాకుండా టోటల్ సౌత్ ఇండస్ట్రీ వరకు కూడా చూసుకుంటే ఏ హీరోకి కూడా ప్రభాస్ లా 5 సార్లు బాక్స్ ఆఫీస్ దగ్గర 400 కోట్ల గ్రాస్ మార్క్ లేదనే చెప్పాలి..మధ్యలో ఆదిపురుష్ మూవీ 400 కోట్లకు క్లోజ్ గా వచ్చినా కూడా ఆ మార్క్ ని క్రాస్ చేయలేక పోయింది. ఆ సినిమా కూడా క్రాస్ చేసి ఉంటే ఏకంగా 6 సినిమాలు అయ్యేవి…

అయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 సార్లు 400 కోట్ల గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని సౌత్ లో మరెవ్వరికీ సాధ్యం కాని రేంజ్ లో భీభత్సం సృష్టిస్తూ ఉండటం, తన అప్ కమింగ్ మూవీస్ అన్నీ కూడా ప్రామిసింగ్ గానే ఉండటంతో ఈ రికార్డుల జాతర ఇలానే కొనసాగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here