బుల్లితెరపై మూడేళ్ళ క్రితం అడుగు పెట్టి… అప్పటి వరకు ఛానెల్స్ రేటింగ్స్ లో 4 వ ప్లేస్ లో ఉన్న స్టార్ మా ని ఒక్కసారిగా టాప్ ప్లేస్ కి చేర్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ రియాలిటీ షో లో తన యాంకరింగ్ తో మెప్పించిన విషయం తెలిసిందే, మొదటి సీజన్ సూపర్ సక్సెస్ అవ్వగా ఎన్టీఆర్ తర్వాత పర్సనల్ పనుల వల్ల మళ్ళీ బిగ్ బాస్ షో కి హోస్ట్ గా చేయడం మానేశారు… కానీ మళ్ళీ ఇప్పుడు మూడేళ్ళ తర్వాత…
ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై తన యాంకరింగ్ తో మెప్పించడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సారి సినిమాల పరంగా దుమ్ము లేపుతున్న మిగిలిన షోల పరంగా చాలా వీక్ గా ఉన్న జెమినీ టీవీ లో మీలో ఎవరు కోటీశ్వరుడు టైప్ లో ఓ భారీ షో ని ప్లాన్ చేస్తుండగా…
ఎన్టీఆర్ హోస్ట్ గా ఆ షో కి యాంకరింగ్ చేయబోతున్నారని సమాచారం. దానికోసం తెలుగు టెలివిజన్ హిస్టరీ లోనే బిగ్గెస్ట్ రెమ్యునరేషన్ ని సొంతం చేసుకోబోతున్నారని టాలీవుడ్ సమాచారం. జెమినీ టీవీ లో మొత్తం మీద 60 ఎపిసోడ్ లు ఈ కొత్త షో లో భాగం కాబోతుండగా అన్ని షోలకు ఎన్టీఆర్ హోస్ట్ గా చేయనున్నారు.
కాగా ఒక్కో ఎపిసోడ్ కి రికార్డ్ లెవల్ లో 30 లక్షల దాకా రెమ్యునరేషన్ ని సొంతం చేసుకోబోతున్నాడట ఎన్టీఆర్, మొత్తం 60 షోలకు కలిపి ఏకంగా 18 కోట్ల రెమ్యునరేషన్ ని ఈ షో కి గాను సొంతం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇది వరకు బిగ్ బాస్ సీజన్ 1 కి గాను ఒక్కో ఎపిసోడ్ కి 35 లక్షల చొప్పున ఆ సీజన్ కి మొత్తం మీద 7 కోట్ల దాకా రెమ్యునరేషన్ ని అందుకున్నాడు ఎన్టీఆర్…
కానీ అది వారానికి 2 ఎపిసోడ్ లు కాగా ఇవి ఎన్టీఆర్ పాల్గొనే టైం లో ఒకేసారి 60 రోజుల కాల్ షీట్స్ తో షూటింగ్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి గంప గుత్తుగా 60 ఎపిసోడ్ లకు 18 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారట. కానీ ఈ ఆఫర్ తో పాటు ఎన్టీఆర్ కావాలి అనుకుంటే రెమ్యునరేషన్ కాకుండా షో కి వచ్చే ప్రాఫిట్ లో షేర్ తీసుకోవచ్చట. మరి రెండింటిలో ఎన్టీఆర్ దేనికి ఓకే అంటారు అన్నది తెలియాల్సి ఉంది.