Home గాసిప్స్ 600 కోట్ల హీరో విజయ్….గోట్ తెలుగు బిజినెస్ ఆఫర్ ఎంత వచ్చిందో తెలుసా!!

600 కోట్ల హీరో విజయ్….గోట్ తెలుగు బిజినెస్ ఆఫర్ ఎంత వచ్చిందో తెలుసా!!

0

కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) కెరీర్ లోనే బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతున్న విషయం తెలిసిందే. బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ ఎలా ఉన్నా కూడా విజయ్ సినిమాల కలెక్షన్స్ మరో లెవల్ లో ఉంటూ ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ నటించిన లాస్ట్ మూవీ లియో(Leo Movie) టోటల్ రన్ లో మిక్సుడ్ టాక్ తో కూడా….

ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఏకంగా 600 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా ఆ సినిమా తర్వాత ఇప్పుడు దళపతి విజయ్ చేస్తున్న లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie) మూవీ ఆడియన్స్ ముందుకు ఈ సెప్టెంబర్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా….

సినిమా మీద ప్రస్తుతానికి మరీ లియో రేంజ్ లో అంచనాలు లేవు కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు పెరిగే అవకాశం ఎంతైనా ఉండగా, విజయ్ సినిమాలకు తెలుగు లో కూడా సాలిడ్ గా వసూళ్లు వస్తూ ఉండగా ఇప్పుడు సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతున్న గోట్ మూవీకి కూడా సాలిడ్ గా బిజినెస్ ఆఫర్స్ వస్తూ ఉన్నట్లు తెలుస్తుంది…

లీడింగ్ టాలీవుడ్ ప్రొడ్యూసర్ లు ఈ సినిమా కోసం ఆల్ రెడీ బిజినెస్ ఆఫర్స్ ను కోట్ చేస్తూ ఉండగా లేటెస్ట్ గా ఆల్ మోస్ట్ సినిమా కి 15 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఆఫర్ సొంతం అయినట్లు తెలుస్తుంది….ఈ రేంజ్ లో బిజినెస్ ఆఫర్ ఈ ఎక్స్ పెరిమెంటల్ మూవీకి సొంతం అవ్వడం మాస్ రాంపెజ్ అనే చెప్పాలి….

విజయ్ నటించిన లియో మూవీకి ఆల్ మోస్ట్ 16 కోట్ల బిజినెస్ జరగగా ఆ సినిమా టోటల్ రన్ లో ఏకంగా 26 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు 15 కోట్ల రేంజ్ లో ఆఫర్ వచ్చినా మేకర్స్ 18-20 కోట్ల రేంజ్ లో ఆఫర్ ను ఎక్స్ పెర్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఆ టైంకి ఈ రేటుని అందుకుంటుందో లేక 15 కోట్ల రేంజ్ రేటుకి బిజినెస్ క్లోజ్ అవుతుందో త్వరలో తేలనుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here