ఒక సినిమా హిట్ అయితే ఆ తర్వాత వచ్చే సినిమా మీద ఎంతో కొంత బజ్ ఏర్పడటం అన్నది కామన్, అదే పెద్ద హీరోలు నటించిన సినిమాలు అయితే ఇక రచ్చ మరో లెవల్ లో ఉంటుంది, కానీ ఇప్పుడు ఓ భారీ బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తున్న సినిమా మాత్రం మినిమమ్ బజ్ ను కూడా సొంతం చేసుకోలేక పోతుంది…
ఆ సినిమానే సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) స్పెషల్ గెస్ట్ రోల్ లో చేస్తున్న లేటెస్ట్ మూవీ లాల్ సలామ్(Lal Salam Movie)….రజినీకాంత్ కూతురు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రజినీకాంత్ స్పెషల్ క్యామియో చేస్తూ ఉండటంతో మంచి బజ్ ఏర్పడింది. సినిమాను ముందు సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అనుకున్నా కూడా…
సినిమాను లాస్ట్ మినట్ లో పోస్ట్ పోన్ చేసి ఫిబ్రవరి 9న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా, రజినీకాంత్ నటించిన లాస్ట్ మూవీ జైలర్(Jailer Movie) ఊహకందని బ్లాక్ బస్టర్ గా నిలిచి 600 కోట్లకు పైగా గ్రాస్ అందుకుని సెన్సేషనల్ కంబ్యాక్ ను సొంతం చేసుకోగా, అలాంటి భారీ హిట్ తర్వాత రజినీ నుండి…
ఎక్స్ టెండెడ్ క్యామియో చేస్తున్న లాల్ సలామ్ మూవీ మినిమమ్ గుడ్ ఓపెనింగ్స్ ను అందుకుంటుంది అని అందరూ అనుకుంటూ ఉన్నప్పటికీ ప్రస్తుతం సినిమా బుకింగ్స్ చూస్తూ ఉంటే చాలా నిరాశ కలిగించే విధంగా ఉన్నాయని అంటున్నారు, దాంతో సినిమా రిలీజ్ అయిన తర్వాత అల్టిమేట్ పాజిటివ్ రెస్పాన్స్ ను…
సొంతం చేసుకుంటే తప్ప జోరు చూపించే అవకాశం ఉందని చెప్పాలి, కానీ ప్రజెంట్ సినిమా మీద కొంచం బజ్ తక్కువగా ఉండటంతో సినిమా మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ కాబోతుంది. జైలర్ లాంటి 600 కోట్లకు పైగా వసూళ్ళని అందుకున్న సినిమా తర్వాత వస్తున్నా లాల్ సలామ్ ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.