బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో భారీ ఎత్తున రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు సినిమా సంక్రాంతి రేసులో నిలిచిన ఒక ఒక్క పెద్ద సినిమా కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా ఓపెనింగ్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపే స్టార్ట్ ని దక్కించుకున్నా కానీ సినిమా తర్వాత…
వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి స్లో డౌన్ అవ్వక తప్పలేదు, దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ఉన్నంతలో ఓవరాల్ గా బాగానే ఉన్నప్పటికీ కూడా మొదటి వీకెండ్ రేంజ్ తో పోల్చితే చాలా చప్పగా సాగుతూ వస్తుంది. ఇక మొదటి వారం తర్వాత రెండో వారంలో…
ఎంటర్ అయిన తర్వాత వీకెండ్ లో ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న బంగార్రాజు ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా సినిమా సోమవారం ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసింది కానీ డ్రాప్స్ కొంచం ఎక్కువగానే సొంతం చేసుకుంది అని చెప్పాలి. అయినా కానీ….
సినిమా ఈ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో 53 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుందని చెప్పాలి. కానీ నైజాం లో బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది ఈ సినిమా కి. ఇక ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు 60 కోట్ల మార్క్ ని అందుకోవడం విశేషం….
ఇండియాలో సంక్రాంతి నుండి ఇప్పటి వరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ 50 కోట్ల మార్క్ ని ఇప్పుడు 60 కోట్ల మార్క్ ని అందుకున్న ఒకే ఒక్క సినిమాగా ఈ ఏడాదికి బంగార్రాజు సినిమా ప్రస్తుతానికి సింగిల్ మూవీగా నిలిచింది అని చెప్పాలి…. ప్రజెంట్ కూడా అన్ని చోట్లా రిలీజ్ అయిన మూవీస్ లో షేర్ సొంతం చేసుకుంటున్న సినిమా ఇదొక్కటే అవ్వడంతో మరింత లాంగ్ రన్ సినిమా కి దక్కే అవకాశం ఉంది.