బాక్స్ ఆఫీస్ దగ్గర కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు మొదటి వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా తెలుగు రాష్ట్రాలలో ఆన్ లైన్ టికెట్ సేల్స్ ఆల్ మోస్ట్ 65% వరకు డ్రాప్ అయింది… ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే సినిమా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 3.5 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది…
ఇక సినిమా కర్ణాటకలో బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా హిందీ లో మాత్రం రిమర్కబుల్ హోల్డ్ ని సొంతం చేసుకోగా హిందీ లో 25 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా గ్రాస్…..
కలెక్షన్స్ 30 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉండగా ఇక తమిళనాడు కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 7-8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియా లో…
55 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా 60 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోబోతుంది అని చెప్పాలి. మొత్తం మీద ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా సినిమా 5 రోజులు పూర్తీ అయ్యే టైం కి టోటల్ గా 610 కోట్ల మార్క్ ని అధిగమించి…
615 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం అలాగే మించి పోయి ముందుకు వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ కూడా ఉందని చెప్పాలి. ఇక మొత్తం మీద వర్కింగ్ డే లో చాలా సినిమాలు అంచనాలను తప్పుతాయి. ఇక కేజిఎఫ్ 2 అఫీషియల్ గా 5 రోజులకు గాను ఎలాంటి కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…..