నట సింహం నందమూరి బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి మళ్ళీ చాలా కాలమే అయింది, జై సింహా సినిమా తో మంచి విజయాన్ని నమోదు చేసిన బాలయ్య తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ డిసాస్టర్ మూవీస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు, ఎన్టీఆర్ బయోపిక్ సిరిస్ మరియు రూలర్ సినిమాలు కంప్లీట్ గా నిరాశ పరిచి డిసాస్టర్ అయ్యాయి. ఇలాంటి టైం లో బాలయ్య ఆశలు పెంచుకున్న సినిమా అఖండ…
తనతో సింహా మరియు లెజెండ్ లాంటి అల్టిమేట్ బ్లాక్ బస్టర్ లను తిరుగు లేని కంబ్యాక్ మూవీస్ ని ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు సాలిడ్ గానే ఉన్నాయి ఇండస్ట్రీ లో…
రీసెంట్ గా రిలీజ్ అయిన బాలయ్య అఘోరా లుక్ కి రెస్పాన్స్ అల్టిమేట్ లెవల్ లో రాగా ఆ టీసర్ ఏకంగా 50 మిలియన్ కి పైగా వ్యూస్ తో సంచలనం సృష్టించింది. ఇక ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం చేయడం ఖాయమని అనుకుంటే ఈ లోపు సెకెండ్ వేవ్ దెబ్బ కొట్టింది.
దాంతో అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా కి కూడా సాలిడ్ డిజిటల్ రిలీజ్ ఆఫర్స్ రావడం మొదలు అయింది, రేటు కూడా బాలయ్య రీసెంట్ మూవీస్ ఫ్లాఫ్ అయినా ఈ సినిమా పై ఉన్న క్రేజ్ దృశ్యా 50 కోట్ల దాకా కూడా రేటు వెళ్ళగా రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ ఏకంగా ఆ రేటు ని కూడా ఇంకా పెంచేసి….
మొత్తం మీద డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కి గాను 65 కోట్ల రేటు ఇవ్వడానికి సిద్ధం అయ్యిందని సమాచారం. తెలుగు లో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజిటల్ రిలీజ్ రేటు ఆఫర్ అని చెప్పాలి. ఈ రేంజ్ రేటు వచ్చిన విషయం తెలుసుకున్న బాలయ్య నా సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ అవ్వాలని తుచ్చం అంటూ ఆ రేటు కి నో చెప్పినట్లు సమాచారం…