Home న్యూస్ రజినీ 2.0 రికార్డ్ ను బ్రేక్ చేసిన అల్లుఅర్జున్ పుష్ప!!

రజినీ 2.0 రికార్డ్ ను బ్రేక్ చేసిన అల్లుఅర్జున్ పుష్ప!!

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన క్రేజ్ పవర్ ను చూపుతూ సంచలన రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతున్నాడు, బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ అల వైకుంఠ పురం లో సినిమా తో సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకోగా, ఆ సినిమా సాంగ్స్ వీడియోలు యూట్యూబ్ లో ఊహకందని రికార్డుల వర్షం కురిపించాయి. ఇక ఈ సినిమా సాధించిన అల్టిమేట్ విజయం తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న…

సరికొత్త సినిమా సుకుమార్ డైరెక్షన్ లో రూపొందుతున్న పుష్ప ఏకంగా పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న సినిమా కాగా సినిమా ఇప్పుడు రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా లో అల్లు అర్జున్ ఇంట్రో టీసర్ ను…

అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేయగా అప్పటి నుండి ఈ టీసర్ సంచలన రికార్డులతో మెంటల్ మాస్ అనిపించే కొత్త బెంచ్ మార్క్ లను సెట్ చేస్తూ దూసుకు పోతూనే ఉండటం విశేషం అనే చెప్పాలి. టాలీవుడ్ తరుపున అన్ని టీసర్ ల రికార్డులను బ్రేక్ చేసి…

సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసిన ఈ సినిమా తర్వాత సౌత్ లో కూడా హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్ ల జాబితాలో ఎంటర్ అవ్వగా ఆ జోరు ని అలాగే కొనసాగిస్తూ ఒక్కో పాత సినిమా రికార్డును బ్రేక్ చేసి ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ రోబో 2.0 సినిమా…

టీసర్ రికార్డును బ్రేక్ చేసి సౌత్ లో టాప్ 2 ప్లేస్ ని సొంతం చేసుకుంది. 2.0 టీసర్ 72.45 మిలియన్స్ తో ఉండగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి ఇప్పుడు 73 మిలియన్స్ వైపు దూసుకు పోతుంది పుష్ప టీసర్, టాప్ ప్లేస్ లో KGF 2  టీసర్ ఎవ్వరికీ అందనంత ఎత్తులో అలాగే కొనసాగుతూ ఉండటం విశేషం, మొత్తం మీద అన్ని ఓల్డ్ రికార్డులను బ్రేక్ చేస్తూ ఇప్పుడు ఏకంగా సౌత్ టాప్ 2 ప్లేస్ ని సొంతం చేసుకుంది పుష్ప.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here