బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి స్లో డౌన్ అవుతుంది అనుకున్న కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా 5వ రోజు మొదటి వర్కింగ్ డే టెస్ట్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపగా ఇప్పుడు 6వ రోజు కూడా మరో వర్కింగ్ డే లో ఎంటర్ అయినా కానీ సినిమా మరో సారి సాలిడ్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసింది. సినిమా 6 వ రోజు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో…..
3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా ఫైనల్ లెక్కలు 3.5 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక కర్ణాటకలో సినిమా మరోసారి 8 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకునేలా ఉందని చెప్పాలి. ఇక హిందీ లో ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర…..
22 కోట్లకు తగ్గని నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఫైనల్ కలెక్షన్స్ 23 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది… ఇక తమిళనాడులో బీస్ట్ ను బీట్ చేసి ఫుల్ లీడ్ తో దూసుకు పోతుంది. ఇక కేరళలో కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ తో దూసుకు పోతుంది.
దాంతో ఈ రెండు చోట్లా సినిమా 8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా మొత్తం మీద ఇండియా లో 6వ రోజు ఇప్పుడు 51 కోట్ల నుండి 52 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా 56 కోట్ల నుండి 58 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది…
ఈ కలెక్షన్స్ తో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 675 కోట్ల మార్క్ ని దాటడం ఖాయంగా ఉండగా ఫైనల్ లెక్కలు 680 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు… మొత్తం మీద రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న కేజిఎఫ్ 2 సినిమా మొదటి వారాన్ని ఊరామాస్ కలెక్షన్స్ తో ముగించడానికి సిద్ధం అవుతుంది…