Home న్యూస్ 690 కోట్ల జాతర….రికార్డులు చెల్లాచెదురు!!

690 కోట్ల జాతర….రికార్డులు చెల్లాచెదురు!!

0

మొదటి వారంలో ఊహకందని కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ రెండో వారంలో అడుగు పెట్టి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో 210 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో 660 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది. ఇక సినిమా 8వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 8.5-9 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా…

హిందీలో సినిమా 12 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోబోతుంది. ఇక కర్ణాటక, తమిళ్ మరియు కేరళ ఏరియాల్లో 4-4.5కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉన్న సినిమా ఇండియాలో 8వ రోజున 25-26 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోబోతూ ఉండగా ఓవర్సీస్ లో సినిమా…

మరోసారి 5 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకోబోతుంది ఇప్పుడు. దాంతో ఓవరాల్ గా 8వ రోజున సినిమా వరల్డ్ వైడ్ గా 30-32 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోబోతుండగా…ఈ కలెక్షన్స్ తో మొత్తం మీద 8 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో…

219 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ను అందుకోబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా 690 కోట్ల రికార్డ్ కలెక్షన్స్ జాతరని నమోదు చేయబోతుంది. ఈ ఇయర్ ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో వసూళ్ళని అందుకోలేదు. ఆల్ రెడీ ఈ ఇయర్ హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాకి డబుల్ కలెక్షన్స్ తో రెబల్ స్టార్ ఊచకోత కోశాడు. ఇక 8 రోజుల్లో సినిమా సాధించే టోటల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here