Home న్యూస్ 8వ రోజు కల్కి కలెక్షన్స్….మళ్ళీ రచ్చ శురూ!!

8వ రోజు కల్కి కలెక్షన్స్….మళ్ళీ రచ్చ శురూ!!

0

సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ గా ఈ రోజున మళ్ళీ జోరు చూపిస్తూ మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతుంది…

తెలుగు రాష్ట్రాల్లో సినిమా బుకింగ్స్ ఆల్ మోస్ట్ డే 7కి సిమిలర్ గా ట్రెండ్ అవుతూ ఉండగా నైజాంలో మరోసారి స్ట్రాంగ్ హోల్డ్ ఉండగా ఆంద్ర మరియు సీడెడ్ లలో పర్వాలేదు అనిపిస్తున్న సినిమా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే ….

5.5-6 కోట్లకు అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా హిందీలో సినిమా 11 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అటూ ఇటూగా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా కర్ణాటక, తమిళ్ మరియు కేరళ ఏరియాల్లో 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది.

   

ఇక ఓవర్సీస్ లో మరోసారి స్ట్రాంగ్ జోరుని చూపిస్తూ దూసుకు పోతున్న సినిమా 8వ రోజు వరల్డ్ వైడ్ గా ఓవరాల్ గా ఇప్పుడు 17-18 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక అంచనాలను మరోసారి మించిపోతే సినిమా…

ఈ అంచనాలను మించి మరోసారి వసూళ్ళని అందుకోవచ్చు.19-20 కోట్లు ఆ పైన షేర్ ని కనుక అందుకుంటే 8వ రోజు రిమార్కబుల్ హోల్డ్ ని చూపించిందని అంచనా వేయొచ్చు. ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 8వ రోజున ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here