Home న్యూస్ గంటలో 69 వేల టికెట్ సేల్స్…BMS క్రాష్…రెబల్ స్టార్ రికార్డుల జాతర ఇది!

గంటలో 69 వేల టికెట్ సేల్స్…BMS క్రాష్…రెబల్ స్టార్ రికార్డుల జాతర ఇది!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా 27న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా నైజాంలో సినిమా బుకింగ్స్ ను ఓపెన్ చేశారు…ఆంధ్రలో టికెట్ హైక్స్ కి ఫైనల్ పర్మీషన్ ఇంకా రావాల్సి ఉండటంతో…

కొంచం డిలే ఉన్నప్పటికీ కూడా కల్కికి ఇండియాలో లిమిటెడ్ థియేటర్స్ చైన్ లో బుకింగ్స్ ను ఓపెన్ చేయగా ఊహకందని భీభత్సం అనిపించే రేంజ్ బుకింగ్స్ తో దూసుకు పోతుంది కల్కి మూవీ…టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాల ఫుల్ బుకింగ్స్ ను ఓపెన్ చేసి ఉంటే ఈ రచ్చ ఇంకో లెవల్ లో ఉండేది..

కానీ ఓపెన్ చేసిన థియేటర్స్ లో ఒక్క గంట గ్యాప్ లో సినిమా టికెట్ సేల్స్ లెక్క ఏకంగా 69 వేల మార్క్ ని అందుకుని మాస్ భీభత్సం సృష్టించింది…బుక్ మై షో లో ప్రతీ గంటలో టికెట్ సేల్స్ లెక్కలను అప్ డేట్ చేయడం మొదలు పెట్టినప్పటి నుండి చూసుకుంటే ఈ లెక్క వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టికెట్ సేల్స్ లో ఒకటి అని చెప్పాలి.

8CR కి అమ్మితే నైజాం గడ్డ మీద టిల్లు స్క్వేర్ ఊరమాస్ ఊచకోత!
మరో పక్క హెవీ ట్రాఫిక్ వలన బుక్ మై షో కూడా క్రాష్ అయ్యింది…అన్ని చోట్లా బుకింగ్స్ ను ఓపెన్ చేసి ఉంటే రికార్డులు మరో లెవల్ లో ఉండేవి. ఈజీగా ఒక లక్ష కి పైగా టికెట్ సేల్స్ గంట గ్యాప్ లోనే సొంతం అయ్యి ఉండేవి…కానీ ఫుల్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ అవ్వాల్సి ఉంది…

ఓపెన్ చేసిన టికెట్ సేల్స్ తోనే సినిమా గ్రాస్ 3.8 కోట్లకు పైగా ఉంటుంది. ఇక PayTM లో కూడా బుకింగ్స్ జోరు యమ స్పీడ్ గా కొనసాగుతూ ఉండగా ఆల్ రెడీ గ్రాస్ బుకింగ్స్ 5.5 కోట్లకు పైగా ఉంటుంది…. ఈ లెక్కన సినిమా రికార్డుల జాతర సృష్టించడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here