టాలీవుడ్ లో ఆల్ మోస్ట్ 2 నెలలు కంప్లీట్ అయ్యింది….సంక్రాంతికి కొన్ని సినిమాలు ఫిబ్రవరి నెలలో కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వగా వాటిలో కొన్ని సినిమాలు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కుమ్మేశాయి. కొన్ని సినిమాలు పెద్దగా అంచనాలను అందుకోలేదు…. కానీ ఉన్నంతలో కొన్ని సినిమాలు మాత్రం…
బ్రేక్ ఈవెన్ ని దాటేసి క్లీన్ హిట్ జాబితాలో చేరగా లేటెస్ట్ గా తమిళ్ నుండి తెలుగు లో డబ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) నటించిన లేటెస్ట్ మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (Return Of The Dragon) సినిమా…
తెలుగు లో అడ్వాన్స్ ల మీద 2 కోట్లు, మిగిలిన ఏరియాల రిలీజ్ వాల్యూ బిజినెస్ మరో 2 కోట్లు మొత్తంగా 4 కోట్ల వాల్యూ బిజినెస్ ను సాధించగా 4.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది… ఓపెనింగ్స్ కుమ్మేసిన తర్వాత సినిమా వర్కింగ్ డేస్ లో కూడా..
ఎక్స్ లెంట్ గా జోరు చూపించగా 6వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఫుల్ బ్రేక్ ఈవెన్ ని దాటేసి క్లీన్ హిట్ గా నిలిచింది. 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 7.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా 6వ రోజున శివరాత్రి అడ్వాంటేజ్ తో అంచనాలను మించి దుమ్ము లేపగా…
ఆల్ మోస్ట్ 1.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం. దాంతో టోటల్ గా 6 రోజుల తెలుగు రాష్ట్రాల గ్రాస్ లెక్క 9.4 కోట్ల రేంజ్ దాకా ఉండగా 6 రోజుల వర్త్ షేర్ లెక్క ఓవరాల్ గ 5.10 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుని అంచనాలను మించిపోయింది.
నైజాం లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తున్న సినిమా మిగిలిన చోట్ల డీసెంట్ టు గుడ్ హోల్డ్ ని కొనసాగిస్తూ ఉండగా లాంగ్ రన్ లో ఇంకా సాలిడ్ హోల్డ్ తో కలెక్షన్స్ పరంగా కుమ్మేసే అవకాశం ఉంది. తెలుగులో ఈ ఇయర్ మార్కో, సంక్రాంతికి వస్తున్నాం, తండేల్ సినిమాల తర్వత ఫుల్ క్లీన్ హిట్ గా ఈ సినిమా నిలిచింది..