బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం చాలా టైం తర్వాత మేజర్ రోల్ చేసిన బ్రహ్మా ఆనందం సినిమా ఒకటి కాగా, ఒకసారి చూసే టైం పాస్ మూవీ లా అనిపించిన ఈ సినిమా వీకెండ్ వరకు కొంతవరకు ఫుట్ ఫాల్స్ ను అయితే థియేటర్స్ కి రప్పించ గలిగింది అని చెప్పాలి.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా వీకెండ్ లో 21 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాలలో 1.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 70 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 2 కోట్ల లోపు గ్రాస్ ను…
95 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా ఓవరాల్ గా వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన తర్వాత మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించ లేక పోయిన సినిమా మరో 35 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకోగలిగింది….తెలుగు రాష్ట్రాల నుండి కేవలం…
30 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా 6 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 1.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా 85 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
2.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 1.15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా….సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకా చాలానే కష్టపడాల్సిన అవసరం ఉండగా ఇక అది కష్టమే అని చెప్పాలి.